టాలీవుడ్..కోలీవుడ్..బాలీవుడ్ ఒక్క సినీ ఇండస్ట్రీ అని కాదు..అన్ని సినీ ఇండస్ట్రీల్లోనూ బయోపిక్ ల హవా సాగుతుంది. పొలిటికల్ నేపథ్యంలో తెలుగులో ఎన్టీఆర్ మహానాయకుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో పాటు మరికొంతమంది బయోపిక్ లు, తమిళంలో జయలలిత బయోపిక్ తెరకెక్కుతుండగా.. ఇప్పుడు హిందీలో భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా మరో బయోపిక్ తెరకెక్కుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘పీఎం నరేంద్రమోదీ’ అనే టైటిల్‌ను ఖరారు చేసిన ఈ బయోపిక్ లో మోడీ పాత్రను బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ పోషిస్తున్నాడు. సర్బజిత్, మేరీ కోమ్ బయోపిక్ ల దర్శకుడు ఒమంగ్ కుమార్ ఈ మూవీకి దర్శకుడు. ఇదిలా ఉండగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఈరోజు రిలీజ్ చేశారు. 23 భాషల్లో డిజైన్ చేసిన పోస్టర్‌ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. పోస్టర్‌పై ‘దేశ భక్తే నా శక్తి’ అనే క్యాప్షన్ వేశారు.
కాగా సురేష్ ఒబెరాయ్ , సందీప్ సింగ్ సంయుక్తంగా నిర్మించనున్న ఈసినిమా ఈనెలలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషలతో కలిపి దాదాపు 23 భాషల్లో విడుదల చేయనున్నారు. చూద్దాం ఈ బయోపిక్ ఏ రేంజ్ లో ఉంటుందో…
[youtube_video videoid=x0H7OpL3afE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: