యాత్ర మూవీ నుండి వైఎస్ విజయమ్మ ఫస్ట్ లుక్ రిలీజ్

YS Vijayamma First Look Out from Yatra,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,YS Vijayamma First Look,First Look of YS Vijayamma in Yatra Movie,Yatra Movie Latest Updates,YS Vijayamma First Look From Yatra Telugu Movie,#Yatra
YS Vijayamma First Look Out from Yatra

మహి.వి రాఘవ్ దర్శకత్వంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో యాత్ర సినిమా తెరకెక్కిన సంగతి తెలిసందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా మిగిలిన కార్యక్రమాలు పూర్తిచేసుకునే పనిలో పడింది. వచ్చే నెల 8వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక ఈ లోపు సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టేశారు. రాజశేఖర్ రెడ్డిగా మమ్ముట్టి లుక్ కి, టీజర్ కి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈరోజే రిలీజ్ అయిన ట్రైలర్ కి కూడా మంచి స్పందన వస్తుంది. ఇక తాజాగా ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి భార్య వైఎస్ విజయమ్మ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. విజయమ్మ పాత్రలో ‘ఆశ్రిత వేముగంటి’ నటించింది. ఆమెకి సంబంధించిన ఫస్టులుక్ ను విడుదల చేయగా.. ఆశ్రిత లుక్ అచ్చం విజయమ్మను తలపించేలా ఉందన్న అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. వైఎస్ పాత్రకు మమ్ముట్టి కరెక్ట్ గా ఎలా సెట్ అయ్యారో.. విజయమ్మ పాత్రకు ఆశ్రిత కూడా కరెక్ట్ గా యాప్ట్ అయిందంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఇంకా ఈసినిమాలో జగపతి బాబు , పోసాని కృష్ణ మురళి , సుహాసిని , అనసూయ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 70ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంఫై శివ మేక సమర్పణ లో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. K సంగీతం అందించారు.

[subscribe]

[youtube_video videoid=OuIJDxLeEBc]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 16 =