మాస్ రాజా రవితేజ ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. `ఎక్కడికి పోతావు చిన్నవాడా` ఫేమ్ వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాని `నేల టిక్కెట్టు` ఫేమ్ రామ్ తాళ్ళూరి నిర్మించనున్నారు. డిస్కో బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ పిరియాడిక్ మూవీకి `డిస్కో రాజా` అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇదిలా ఉంటే… డిసెంబర్‌లో సెట్స్ పైకి వెళ్ళాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం… ఈ సినిమాని రవితేజ పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ నెల 26న లాంఛనంగా ప్రారంభించనున్నట్లు టాలీవుడ్ టాక్. అలాగే… ఈ చిత్రంలో రవితేజకి జోడీగా `ఆర్ ఎక్స్ 100` ఫేమ్ పాయల్ రాజ్‌పుత్, `నన్ను దోచుకుందువటే` ఫేమ్ నభా నటేశ్, `టాక్సీవాలా` ఫేమ్ ప్రియాంక జవాల్కర్ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక యువ సంగీత సంచలనం తమన్ ఇప్పటికే సంగీతదర్శకుడిగా ఖరారు అయ్యాడు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడతాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=GKJ6ZbZghrg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: