క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు అంటూ రెండు పార్ట్ లుగా తెరకెక్కుతున్న ఈసినిమాలో మొదటి భాగమైన ఎన్టీఆర్ కథానాయకుడు పార్ట్ మరో రెండు రోజుల్లో రిలీజ్ కానుంది. సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ టైమ్ కూడా దగ్గరపడుతుండటంతో ఈసినిమా ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రమోషన్స్ లో భాగంగానే ఇప్పటివరకూ సినీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి పలు థియేటర్లలో వందకు పైగా విగ్రహాలు ప్రతిష్టించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ కథానాయకుడు తొలి షోకు బాలకృష్ణ ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. బాలకృష్ణకు ముహూర్తాలపై నమ్మకం ఎక్కువని అందరికీ తెలిసిన విషయమే. సినిమా ప్రారంభానికి..సినిమా ఫంక్షన్లకి అంతెందుకు ముహూర్తం చూసిన తరువాతే ఆయన ఇంటి నుండి కాలు బయటపెట్టరన్న విషయం తెలిసిందే. ఆ సెంటి మెంట్ తోనే ఇప్పుడు ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాకు కూడా తొలి షో కు ముహూర్తం పెట్టారట. 9వ తారీఖు ఉదయం 5 గంటలకు షో పడాలని ఆయన ముహూర్తం పెట్టారు. నిజానికి ఇక్కడ ప్రీమియర్ షోలకు అనుమతి లేదు. కానీ ఒక భ్రమరాంబ థియేటర్లో మాత్రం ప్రీమియర్ షోకి అనుమతి తీసుకొని మరీ షో వేయనున్నారట. ఇక ఆంధ్రాలో ఇలాంటి సమస్య లేదు కాబట్టి అక్కడ 5 గంటల నుండే షోలు పడనున్నాయి. మరి బాలయ్య సెంటిమెంట్ ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో చూద్దాం…
[youtube_video videoid=SIx3-oBW_rA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: