‘ముత్తయ్య మురళీధరన్’ బయోపిక్ కు టైటిల్ ఫిక్స్

Title Confirmed For Srilankan Cricketer Muttiah Muralitharan Biopic Movie

సెన్సేషనల్ శ్రీలంక క్రికెటర్, స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ను తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ బయోపిక్ లో విజయ్ సేతుపతి నటిస్తున్నట్టు రీసెంట్ గా అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ కు రాకముందు మురళీధరన్ జీవితానికి సంబంధించిన సంఘటనలు.. క్రికెట్ ప్రియులకు, అతని అభిమానులకు ఎవరికీ తెలియని మురళీధరన్ జీవితాన్ని ఇందులోచూపిస్తారట. ప్రస్తుతం విజయ్ సేతుపతి ఆయన బౌలింగ్ శైలితోపాటు మ్యాన‌రిజ‌మ్స్‌ను ను కూడా నేర్చుకునే పనిలో పడినట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. వ‌న్డేల్లో ముర‌ళీ 534 వికెట్లు తీశాడు. టెస్టుల్లో 800 వికెట్లు త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు 800 అనే టైటిల్ ను పెట్టినట్టు తెలుస్తుంది.

త‌న స్పిన్ మాయాజాలంతో ప్ర‌పంచ క్రికెట్‌లో ప‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ముత్తయ్య మురళీధర్. 1992 నుండి 2011 మధ్య శ్రీలంక జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 1996లో తమ జట్టు ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. మొత్తం 133 టెస్టుల్లో అత్యధిక వికెట్లు (800) తీసిన ఆటగాడిగా మురళీధరన్ మొదటిస్థానంలో ఉన్నాడు. 2011లో రిటైర్మెంట్ ప్ర‌క‌టించాక వివిధ టీ20 టోర్నీల్లో ముర‌ళీ ఆడాడు. అనంత‌రం కోచ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. ప్ర‌స్తుతం అతను ఐపీఎల్ జ‌ట్టు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు స్పిన్ కోచ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.