మహేష్ – త్రివిక్రమ్ సినిమా.. ట్వీట్ తో హింట్

Super Star Mahesh Babu Hints About His New Movie With Trivikram Srinivas Through His Latest Tweet

త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ లో వచ్చిన ఖలేజా సినిమాను అంత తొందరగా ఎవరూ మర్చిపోరు. అప్పటిదాకా మహేష్ లో అంత కామెడీ యాంగిల్ ఉందని త్రివిక్రమ్ చూపించేంత వరకూ ఎవరికీ తెలీదు. అందుకే కేవలం మహేష్ అభిమానులకు మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరూ సినిమాను అంతగా ఇష్టపడతారు. ఈ సినిమాలో మహేష్ బాబు హీరోయిజం వైవిధ్యంగా ఉంటుంది. త్రివిక్రమ్ డైలాగులు.. సునీల్, ఆలీ కామెడీ ఇలా ప్రతి అంశం మహేష్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక మణిశర్మ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ ఎక్కడో ఒక చోట పాటలు వినిపిస్తూనే ఉంటాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ సినిమా విడుదలై నేటికి 10 ఏళ్ళు అవుతోంది. ఈ సందర్భంగా మహేష్ తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ”ఖలేజాకు 10 ఏళ్లు! నటుడిగా నన్ను కొత్తగా ఆవిష్కరించింది ! ఎప్పటికీ నాకు ప్రత్యేకమైనదిగా మిగిలిపోతుంది ! నా బెస్ట్ ఫ్రెండ్ బ్రిలియంట్ డైరెక్టర్ త్రివిక్రమ్ కు ధన్యవాదాలు. మన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నా .. అతి త్వరలో ” అని మహేష్ ట్వీట్ లో పేర్కొన్నాడు. ఇక ఇప్పుడు ఈ ట్వీట్ చాలా ఇంట్రెస్టింగ్ మారింది.

 

మరి గత కొద్దికాలంగా వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక మహేష్ ఈ ట్వీట్ తో హింట్ ఇచ్చాడని అంటున్నారు.. మరి అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూద్దాం.

ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.