‘వకీల్ సాబ్’ సెట్ లో నివేదా

Nivetha Thomas is back on Vakeel Saab Seets

మొత్తానికి సినీపరిశ్రమకు ఇప్పుడిప్పుడే కళ వస్తుంది. అందరూ షూటింగ్స్ ను మళ్ళీ మొదలుపెడుతున్నారు. ఇక థియేటర్స్ కూడా కొద్దిరోజుల్లో తెరుచుకోనున్న నేపథ్యంలో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇందులో భాగంగానే.. రీసెంట్ గానే వకీల్ సాబ్ చిత్ర యూనిట్ కూడా షూటింగ్ ను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉండగా..ప్రస్తుతం హైదరాబాదు పరిసరాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుతున్నారు. ఈ చిత్రీకరణలో కథానాయిక అంజలి, ఇతర నటీనటులు పాల్గొంటున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాలో నివేత థామస్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ఇన్ని రోజులు ‘వి’ సినిమా ప్రమోషన్స్ అంటూ బిజీ గా ఉన్న నివేదా తాజాగా వకీల్ సాబ్ షూటింగ్ లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. వకీల్ సాబ్ సెట్ ఫొటో ను తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ మళ్లీ షూటింగ్ లో పాల్గొన్నందుకు చాలా హ్యాపీగా ఉందని తెలిపింది.

 

ఇక మరో కీలక పాత్రలో నటించనున్న శృతి హాసన్ కూడా త్వరలోనే షూట్ లో పాల్గొననుందట. మరోవైపు పవన్ కల్యాణ్ ఈ నెల చివరిలోపాల్గొంటారని తెలుస్తోంది. కాగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ ను తెలుగులో ‘వకీల్ సాబ్’ గా చేస్తున్నసంగతి తెలిసిందే కదా. బోనీ కపూర్‌ నిర్మాణ సంస్థ బేవ్యూ ప్రాజెక్ట్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + 16 =