కితకితలు, అత్తిలి సత్తిబాబు ఎల్ కె జి , సీమ శాస్త్రి, బెండు అప్పారావు ఆర్ ఎమ్ పి, బెట్టింగ్ బంగార్రాజు, సుడిగాడు, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన కామెడీ హీరో అల్లరి నరేష్ ఇప్పుడు ఒక కొత్త ఇమేజ్ కు “నాంది” పలికారు. దర్శకుడు సతీష్ వేగేశ్న నిర్మాణ సారథ్యంలో ఎస్ వి 2 ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నూతన దర్శకుడు విజయ్ కనకమేడల దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ “నాంది” మూవీ రూపొందనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న “నాంది” మూవీ ఈ రోజు ప్రారంభం కానుంది. “నాంది” మూవీ టైటిల్ , ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. అల్లరి నరేష్ డిఫరెంట్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అల్లరి నరేష్ హీరోగా రూపొందిన “దొంగల బండి” మూవీ దర్శకుడు సతీష్ వేగేశ్న “నాంది” మూవీ కి నిర్మాత కావడం విశేషం. అల్లరి నరేష్ 57 వ మూవీ “నాంది”, కామెడీ హీరోగా ముద్ర పడిన నరేష్ కు ఒక డిఫరెంట్ మూవీగా రూపొందనుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: