యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, `ఇస్మార్ట్` డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో ఓ స్పోర్ట్స్ డ్రామా రానున్న సంగతి తెలిసిందే. `ఫైటర్` పేరుతో తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో విజయ్ బాక్సర్ గా దర్శనమివ్వనున్నాడు. పాన్ – ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ సోమవారం (జనవరి 20) నుండి ప్రారంభం కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఇదిలా ఉంటే… ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఎంపికైందని తెలిసింది. ఇప్పటికే `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2`, `పతీ పత్నీ ఔర్ వో` వంటి హిందీ చిత్రాల్లో కనువిందు చేసిన అనన్య.. ప్రస్తుతం `ఖాళీ పిలీ`లో నటిస్తోంది. మరి.. `ఫైటర్`తో తెలుగు చిత్ర సీమలో తొలి అడుగేస్తున్న అనన్యకి.. మొదటి ప్రయత్నంలోనే విజయం వరిస్తుందేమో చూడాలి. త్వరలోనే అనన్య ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























