‘ఒరేయ్‌ బుజ్జిగా’ షూటింగ్ పూర్తి – రిలీజ్ డేట్ ఫిక్స్..!

Orey Bujjiga Movie Shoot Wrapped Up

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌.. బుజ్జిగా’. గతకొద్ది రోజులుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ పార్ట్ తాజాగా కంప్లీట్ చేసుకుంది. అంతేకాదు ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 3 న విడుదల చేయనున్నట్టు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ ”మా ఒరేయ్ బుజ్జిగా షూటింగ్ పూర్తయింది. రాజ్‌ తరుణ్‌ ఎనర్జీకి తగిన యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. దర్శకులు కొండా విజయ్‌కుమార్‌గారు డిఫరెంట్‌ స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 3 న చిత్రాన్ని విడుదల చేయనున్నాం. తప్పకుండా మా ‘ఒరేయ్‌.. బుజ్జిగా’ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఇది మా బేనర్‌లో మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది” అన్నారు.

[custom_ad]

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో హెబా పటేల్, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 15 =