త్రివిక్రమ్‌తో ముచ్చటగా మూడోసారి జత కట్టి అల్లు అర్జున్ ఈసారి కేరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. మొత్తానికి లాంగ్ గ్యాప్ తీసుకున్న బన్నీకి ఈ సినిమా మంచి రిలీఫె ఇచ్చింది. అటు క్లాస్, ఇటు మాస్ అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పించి బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపించుకుంటున్న ఈ సినిమాకి ఫస్ట్ రోజు లానే ప్రతి రోజూ బాక్స్ ఆఫీస్ షేక్ చేసే రేంజ్ లో కలెక్షన్స్ వస్తున్నాయి. రిలీజ్ అయి దాదాపు వారం రోజులు కావస్తున్నా అల వైకుంఠపురములో కలెక్షన్స్ అదే గ్రాఫ్‌ను మెయింటెన్ చేస్తూ వస్తుంది. విడుదలైన నాలుగు రోజులకే నాన్ బాహుబలి రికార్డులను సైతం దాటేసింది. ఇక వారం రోజుల్లో ఈ సినిమా 104కోట్ల షేర్ ను రాబట్టినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
మొదటి ఐదు రోజుల్లో 69.63 కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేసి పలు ఏరియాల్లో బాబుబలి 2 రికార్డ్ ని నెలకొల్పిన ఈ చిత్రం 6వ రోజు కూడా హౌస్ ఫుల్స్ తో 8 కోట్ల షేర్ సాధించింది.
‘అల వైకుంఠపురములో’ 6 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్:
నైజాం – 24.55 కోట్లు
సీడెడ్ – 12.1 కోట్లు
గుంటూరు – 7.61 కోట్లు
ఉత్తరాంధ్ర – 11.12 కోట్లు
తూర్పు గోదావరి – 6.92 కోట్లు
పశ్చిమ గోదావరి – 5.37 కోట్లు
కృష్ణా – 7.04 కోట్లు
నెల్లూరు – 3 కోట్లు
[custom_ad]
ఆరు రోజుల మొత్తం షేర్ – 77.71 కోట్లు
వరల్డ్ వైడ్ గా 104 కోట్ల షేర్ రాబట్టుకుంది.
ఇక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నేపథ్యంలో సెలబ్రేషన్స్ చేసేందుకు రెడీ అయిపోయింది చిత్రయూనిట్. సక్సెస్ మీట్‌ను వైజాగ్‌లో ప్లాన్ చేసింది అల్లు అర్జున్ టీం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: