స్టార్ హీరో.. స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ లో సినిమా మొదలవుతుందంటే.. ఇక ఆ సినిమాకు సంబంధించిన పలు రూమర్లు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఇది ఎప్పటినుండో చూస్తూనే వున్నాం. ఇక ఈసారి ఆ రూమర్లకు బుక్ అయిన సినిమా ఏంటంటే.. బన్నీ-సుకుమార్ సినిమా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బన్నీ టాలెంటెడ్ డైరెక్టర్స్ సుకుమార్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఇప్పటికే ప్రారంభించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతున్న సంగతి కూడా విదితమే. ఈ నేపథ్యంలోనే సినిమా శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ కి సంబందించిన కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని అందుకే ఈ సినిమాకు ‘శేషాచలం’ అన్న టైటిల్ అనుకుంటున్నట్టు రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ రూమర్లపై చిత్రయూనిట్ స్పందించి క్లారిటీ ఇచ్చింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. త్వరలోనే దీనిపై ప్రకటన ఇస్తామని తెలిపారు.
[custom_ad]
Title for Stylish Star @alluarjun‘s #AA20 with Sukumar Garu is not yet finalized…
Reports that are appearing in some web sites regarding the title are all false and there is no truth in the same. The title will be announced at an appropriate time later.
Thank you!
— Mythri Movie Makers (@MythriOfficial) January 20, 2020
[custom_ad]
కాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్ననటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
మరి అల్లు అర్జున్ రీసెంట్ గా త్రివిక్రమ్ డైరెక్షన్ లో ‘అల వైకుంఠపురములో’ లో నటించి హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. మరి ఆర్య సిరీస్ తర్వాత సుకుమార్ తో బన్నీ చేస్తున్న సినిమా ఇది. చూద్దాం ఈసినిమాతో కూడా హ్యాట్రిక్ కొడతాడేమో.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: