తమిళనాట వసూళ్ళ వర్షం కురిపించిన `అసురన్`ని.. తెలుగులో విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా పునర్నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మాతృక నిర్మాత కలైపులి ఎస్. థానుతో కలసి డి. సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో వెంకీకి జోడీగా ప్రియమణి నటించనున్నట్లు ప్రచారం సాగుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఇదిలా ఉంటే.. ఈ యాక్షన్ థ్రిల్లర్ కి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ని ఈ నెల 22 నుండి ప్రారంభించనున్నారని సమాచారం. అంతేకాదు.. మెరుపు వేగంతో చిత్రాన్ని పూర్తి చేసి వేసవి చివరలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారట. కాగా, మణిశర్మ సంగీతమందించనున్న `అసురన్` రీమేక్.. అనంతపురం నేపథ్యంలో సాగుతుందని టాక్. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికానున్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: