
ట్యాగ్ · 609 కథనాలు


కొత్త లుక్ లో ఎన్టీఆర్ .. పిక్స్ వైరల్

ఎన్టీఆర్ నీల్ లో జాయిన్ కానున్న ఎన్టీఆర్

లిటిల్ వారియర్ ధైర్యంగా ఉండు - ఎన్టీఆర్

ఎన్టీఆర్ నీల్ సెట్ లో అడుగుపెట్టనున్న ఎన్టీఆర్

అదుర్స్ 2 అందుకే చెయ్యట్లేదు - ఎన్టీఆర్

దేవర 2 పక్కాగా వస్తుంది - ఎన్టీఆర్

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ రానున్న ఎన్టీఆర్

వార్ 2 అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది

వార్ 2 షూటింగ్ అప్డేట్

శివరాత్రికి థియేటర్లలో ఎన్టీఆర్ సినిమాలు

దేవర ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన ఎన్టీఆర్

ఎన్టీఆర్ నీల్ షూటింగ్ ప్రారంభం

పదేళ్లు పూర్తిచేసుకున్న ఎన్టీఆర్ టెంపర్

ఎన్టీఆర్ నీల్ నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఎన్టీఆర్ నీల్ (వర్కింగ్ టైటిల్) తదుపరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది.ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అవుట్‌పుట్ విషయంలో కొన్ని మార్పులు, రూమర్స్ వచ్చినా, చిత్ర యూనిట్ అవన్నీ పక్కనపెట్టి కొత్త షెడ్యూల్‌ను మొదలుపెట్టబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

కొత్త లుక్ లో ఎన్టీఆర్ .. పిక్స్ వైరల్
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ తన కొత్త లుక్‌తో కనబడిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ తాజా లుక్ ఆయన రాబోయే పాన్-ఇండియా చిత్రం 'డ్రాగన్' (వర్కింగ్ టైటిల్) కోసమే.ఈ ఫొటోల్లో గతంలో కంటే ఎన్టీఆర్ చాలా బరువు తగ్గి, లీన్ ఫిజిక్‌తో కనిపిస్తున్నారు.ఈ సన్నబడిన లుక్ పట్ల కొందరు అభిమానులు మొదట్లో ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ,ఆయన పాత్రకు తగినట్టుగా ఈ మార్పు చేసుకున్నారని తెలుస్తోంది.

రిషబ్ శెట్టి 24 క్రాఫ్ట్స్‌ని డామినేట్ చేయగలడు - ఎన్టీఆర్
కాంతారతో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ అందుకున్న రిషబ్ శెట్టి మోస్ట్ ఎవైటెడ్ ప్రీక్వెల్ కాంతార: చాప్టర్ 1తో రాబోతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన స్వయంగా దర్శకత్వం వహించి, నటించారు. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అన్ని భాషలలో హ్యుజ్ బజ్ క్రియేట్ అంచనాలను భారీగా పెంచింది.

కాంతార: చాప్టర్ 1 ప్రీ-రిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్ట్‌గా ఎన్టీఆర్
'కాంతార'తో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ అందుకున్న రిషబ్ శెట్టి మోస్ట్ ఎవైటెడ్ ప్రీక్వెల్ కాంతారా: చాప్టర్ 1తో రాబోతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన స్వయంగా దర్శకత్వం వహించి, నటించారు. ప్రఖ్యాత పాన్-ఇండియా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న దసరాకు విడుదల కానుంది.

ఎన్టీఆర్ నీల్ లో జాయిన్ కానున్న ఎన్టీఆర్
ఎన్టీఆర్ ,ప్రశాంత్ నీల్ ల మచ్ అవైటెడ్ మూవీ ఎన్టీఆర్ నీల్ (వర్కింగ్ టైటిల్) రీసెంట్ గానే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే.ఎన్టీఆర్ లేకుండానే ఈ షెడ్యూల్ జరిగింది.ఇక రేపటి నుండి సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది.ఇందులో ఎన్టీఆర్ జాయిన్ కానున్నాడు.కర్ణాటక లో ఈషెడ్యూల్ జరుగనుంది.ఇందులో కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించనున్నారు.

రాసి పెట్టుకోండి, ఆఖరి 20 నిమిషాలు మాత్రం.. ఎన్టీఆర్
నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ అర్జున్ S/O వైజయంతి. ఈ చిత్రంలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఈ రెండు పాత్రలు మధ్య డైనమిక్స్ కీలకంగా వుండబోతున్నాయి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తోంది.

అర్జున్ S/O వైజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఎన్టీఆర్
నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ అర్జున్ S/O వైజయంతి. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించగా, విజయశాంతి హీరో తల్లిగా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రంలో సోహైల్ ఖాన్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీరాజ్ ప్రముఖ పాత్రల్లో కనిపించనున్నారు.

లిటిల్ వారియర్ ధైర్యంగా ఉండు - ఎన్టీఆర్
లిటిల్ వారియర్ ధైర్యంగా ఉండు అని మార్క్ శంకర్‌ని కోరారు స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా.. "సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ చిక్కుకున్నాడని విని బాధపడ్డాను. తను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. లిటిల్ వారియర్ ధైర్యంగా ఉండు! పవన్ కళ్యాణ్ గారు మరియు ఆయన కుటుంబ సభ్యులు ఈ సమయంలో ధైర్యంగా ఉండాలి. వారికోసం నేను ప్రార్ధిస్తున్నాను." అని పేర్కొన్నారు.

ఎన్టీఆర్ నీల్ సెట్ లో అడుగుపెట్టనున్న ఎన్టీఆర్
దేవర తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ తెలుగు సినిమాను కెజియఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్నాడని తెలిసిందే.ఎన్టీఆర్ లేకుండానే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. ఇక నెక్స్ట్ షెడ్యూల్ లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యాడు.వార్ 2 షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ కావడంతో ఎన్టీఆర్ నీల్ తో చేస్తున్న సినిమాలో జాయిన్ కానున్నాడు.ఈనెల 22 న ఎన్టీఆర్ సెట్ లో అడుగుపెట్టనున్నాడు.ఇక ఈసినిమా రిలీజ్ డేట్ కూడా మారనుందని ప్రచారం జరుగుతుంది. సినిమా అనౌన్స్ మెంట్ రోజున సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేస్తామని ప్రకటించారు కానీ ఆ సమయానికి సినిమా రెడీ అయ్యాలే కనబడకపోవడంతో రిలీజ్ డేట్ మార్చాలని చూస్తున్నారట.

అదుర్స్ 2 అందుకే చెయ్యట్లేదు - ఎన్టీఆర్
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ వున్నాయి. అవన్నీ ఆయనకు ఎంతో మాస్ ఇమేజ్ తీసుకొచ్చాయి. అయితే వాటిలో ఒక చిత్రం మాత్రం తారక్ ఇమేజ్‌ను పూర్తిగా మార్చేసింది. అదే 'అదుర్స్' సినిమా. ఈ సినిమాతో ఎన్టీఆర్ హాస్యాన్ని కూడా అద్భుతంగా పండించగలడని అనిపించుకున్నారు. 'చారి' పాత్రలో ఆయన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

దేవర 2 పక్కాగా వస్తుంది - ఎన్టీఆర్
'దేవర 2' పక్కాగా వస్తుందని స్పష్టం చేశారు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ఈ మేరకు ఆయన తాజాగా జరిగిన 'మ్యాడ్ స్క్వేర్' సక్సెస్ మీట్ కి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా వెల్లడించారు. 'దేవర 2 రాదని అనుకుంటున్నవారికి చెబుతున్నా.. ఖచ్చితంగా వస్తుంది' అని తేల్చిచెప్పారు. అలాగే సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఓ చిత్రం చేయనున్నట్టు కూడా తెలిపారు తారక్. దీనికి కోలీవుడ్ డైరెక్టర్ 'జైలర్' ఫేమ్ నెల్సన్ డైరెక్షన్ చేసే ఛాన్స్ వుంది.

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ రానున్న ఎన్టీఆర్
గత వారంలో విడుదలైన మ్యాడ్ స్క్వేర్ సాలిడ్ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద డామినేషన్ కొనసాగిస్తుంది.కేవలం ఆరు రోజుల్లోనే 70 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకుంది.స్టార్ క్యాస్ట్ ఎవరు లేకుండా సీక్వెల్ ట్యాగ్ తో వచ్చిన ఈసినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.ఇప్పటివరకు 10 కోట్లకుపైగా లాభాలను తీసుకొచ్చింది.ఈవారంలో ఈసినిమా 100 కోట్ల క్లబ్ లో జాయిన్ కానుంది.ఆలెక్కన బయ్యర్ల పాలిట జాక్ పాట్ కానుంది.

కింగ్‌డమ్ టీజర్ కోసం ఎన్టీఆర్‌ని కలిస్తే.. విజయ్ దేవరకొండ
టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'కింగ్‌డమ్'. 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగా, సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే దీనికి వివిధ భాషలలో పలువురు స్టార్ హీరోలు వాయిస్ ఓవర్ అందించిన విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ కటౌట్‌కి పుష్పాభిషేకం చేసిన జపాన్ లేడీ ఫ్యాన్స్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన 'దేవర పార్ట్ 1' చిత్రం త్వరలో జపాన్‌లో విడుదలవుతోంది. మార్చి 28న ఈ మూవీ జపనీస్ భాషలో జపాన్ వ్యాప్తంగా భారీగా రిలీజ్ కానుంది. అయితే జపాన్‌లో జూనియర్‌కి విశేష ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. ఆయనకు అక్కడ లక్షల సంఖ్యలో అభిమానులున్నారు. ఈ క్రమంలో దేవర మూవీ అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని తారక్ అభిమానులు ధీమాగా ఉన్నారు.

వార్ 2 అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది
వార్ 2 నుండి ఎట్టకేలకు అఫీషియల్ గా ఓ అప్డేట్ వచ్చింది.సినిమా ప్రారంభమైనప్పటి నుండి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.మే లోపు బ్యాలెన్స్ షూట్ కంప్లీట్ కానుంది.ఆతరువాత నాన్ స్టాప్ ప్రమోషన్స్ చేయాలని చూస్తున్నారు.ఇందులో హృతిక్ రోషన్ తోపాటు ఎన్టీఆర్ నటిస్తుండడంతో తెలుగులోనూ ఈసినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వార్ 2 షూటింగ్ అప్డేట్
ఎలాంటి అఫీషియల్ అప్డేట్స్ లేకుండా సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటుంది వార్ 2.ఇందులో హృతిక్ రోషన్ ,ఎన్టీఆర్ నటిస్తున్నారు.ప్రస్తుతం ముంబై లో లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది.ఇందులో నిన్నటి నుండి ఎన్టీఆర్ ,హృతిక్ లపై పాటను చిత్రీకరిస్తున్నారు.బోస్కో మార్టిస్ కొరియోగ్రఫీలో సుమారు 500 మంది జూనియర్ ఆర్టిస్టులు ఈ సాంగ్ షూట్ లో పాల్గొంటున్నారు.ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ కంప్లీట్ కానుంది.

శివరాత్రికి థియేటర్లలో ఎన్టీఆర్ సినిమాలు
మరో రెండు రోజుల్లో మహాశివరాత్రి పండుగ రాబోతోంది. ఆరోజున తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా కోట్లాదిమంది భక్తులు పూజలు, పునస్కారాలలో నిమగ్నమై ఉంటారు. అలాగే ఉపవాసం మరియు జాగరణ వంటి నియమాలతో ఆ పరమ శివుడిని తలచుకుంటూ రోజంతా నిష్టగా గడుపుతారు. అయితే మరోవైపు సినీ ప్రియులు మాత్రం కొత్త సినిమాలు లేదా స్టార్ హీరోల సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

దేవర ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన ఎన్టీఆర్
గత ఏడాది సెప్టెంబర్ లో థియేటర్లలోకి వచ్చి 400 కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది దేవర ఫస్ట్ పార్ట్.ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ లో నటించిన ఈసినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేశాడు.థియేట్రికల్ రిలీజ్ తరువాత ఓటిటి లోకి రాగ అక్కడ కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈసినిమా జపాన్ లో విడుదలకానుంది. ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ కి జపాన్ లో ఫాలోయింగ్ వచ్చింది.దాంతో దేవరను జపనీస్ లో విడుదలచేయనున్నారు.

ఎన్టీఆర్ నీల్ షూటింగ్ ప్రారంభం
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గతేడాది 'దేవర' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. దీని తరువాత ఆయన వరుస సినిమాలను లైన్‌లో పెట్టాడు. ఇప్పటికే బాలీవుడ్ మూవీ 'వార్ 2'లో హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ పంచుకోనుండగా.. నెక్స్ట్ ప్రాజెక్టును 'కేజీఎఫ్, సలార్' ఫేమ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో షురూ చేశాడు. ఈ కాంభినేషన్‌పై భారీ అంచనాలే వున్నాయి.

పదేళ్లు పూర్తిచేసుకున్న ఎన్టీఆర్ టెంపర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు గ్లోబల్ స్థాయిలో ఇమేజ్ ఉన్న ఓ స్టార్ హీరో. పాన్ ఇండియా బిగ్గెస్ట్ హిట్ సినిమాలలో ఒకటైన 'ఆర్ఆర్ఆర్' లో ఎన్టీఆర్ భాగం. ఇండియా నుంచి జపాన్ వరకూ ఆయన పాపులారిటీ స్ప్రెడ్ అయ్యింది. అయితే ఒక దశాబ్దం క్రితం ఆయనకు ఇంత ఇమేజ్ లేదు. కేవలం తెలుగు చిత్ర పరిశ్రమకే తను స్టార్ హీరో. కానీ, ఎన్టీఆర్ కెరీర్‌ను మలుపుతిప్పి తను ఈ స్థాయికి చేరుకోవడంలో, మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా కీర్తించబడటంలో కీలక భూమిక పోషించింది మాత్రం ఓ సినిమా.