మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గతేడాది ‘దేవర’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. దీని తరువాత ఆయన వరుస సినిమాలను లైన్‌లో పెట్టాడు. ఇప్పటికే బాలీవుడ్ మూవీ ‘వార్ 2’లో హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ పంచుకోనుండగా.. నెక్స్ట్ ప్రాజెక్టును ‘కేజీఎఫ్, సలార్’ ఫేమ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో షురూ చేశాడు. ఈ కాంభినేషన్‌పై భారీ అంచనాలే వున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ప్రస్తుతానికి ఈ చిత్రాన్ని ఎన్టీఆర్-నీల్ అనే వర్కింగ్ టైటిల్‌తో వ్యవహరిస్తన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ అందింది. ఈరోజు ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయింది. అయితే నేటి నుండి సాగే ఈ ఫస్ట్ షెడ్యూల్ తారక్ లేకుండానే జరుగనుంది. రామోజీ ఫిలిం సిటీ వేదికగా దాదాపు 10 రోజులపాటు కొనసాగనున్న ఈ ఫస్ట్ షెడ్యూల్‌లో సినిమాలో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
మార్చిలో జరుగనున్న సెకండ్ షెడ్యూల్ నుండి ఎన్టీఆర్ జాయిన్ కానున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ తన లుక్ మార్చే పనిలో వున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా ‘సప్త సాగర దాటి’ ఫేమ్ రుక్మిణి వసంత్ నటించనున్నట్టు సమాచారం. ఇక ప్రశాంత్ నీల్ చిత్రాలకు ఆస్థాన విద్వాంసుడిగా ముద్రపడిన రవి బస్రూర్ మరోసారి ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు.
కాగా ఎన్టీఆర్-నీల్ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ ప్రొడక్షన్ వాల్యూస్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్నారు మేకర్స్. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: