నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ అర్జున్ S/O వైజయంతి. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించగా, విజయశాంతి హీరో తల్లిగా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రంలో సోహైల్ ఖాన్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీరాజ్ ప్రముఖ పాత్రల్లో కనిపించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ రామ్ ప్రసాద్, ఎడిటింగ్ తమ్మిరాజు, స్క్రీన్‌ప్లే: శ్రీకాంత్ విస్సా అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యూజ్ సెన్సేషన్ సృష్టిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 18న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్తూరులో జరిగిన ఈవెంట్‌లో ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ‘ముచ్చటగా బంధాలే’ సాంగ్‌ని లాంచ్ చేశారు. చిత్ర యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.
ఈ సందర్భంగా హీరో నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. “12వ తేదీన మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతుంది. ఆ ఈవెంట్ కి తమ్ముడు వస్తాడు. ఆరోజు మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం” అని తెలిపారు. దీంతో నందమూరి అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇక తారక్ ఇటీవలే మ్యాడ్ స్క్వేర్ మూవీ సక్సెస్ ఈవెంట్‌కి వచ్చిన విషయం తెలిసిందే. దేవర తర్వాత ఆయన అభిమానులను నేరుగా కలవడం ఇదే. ఇప్పుడు అర్జున్ S/O వైజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రానుండటంతో ఆయన ఫ్యాన్స్ దీనికోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: