‘దేవర 2’ పక్కాగా వస్తుందని స్పష్టం చేశారు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ఈ మేరకు ఆయన తాజాగా జరిగిన ‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్ మీట్ కి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా వెల్లడించారు. ‘దేవర 2 రాదని అనుకుంటున్నవారికి చెబుతున్నా.. ఖచ్చితంగా వస్తుంది’ అని తేల్చిచెప్పారు. అలాగే సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఓ చిత్రం చేయనున్నట్టు కూడా తెలిపారు తారక్. దీనికి కోలీవుడ్ డైరెక్టర్ ‘జైలర్’ ఫేమ్ నెల్సన్ డైరెక్షన్ చేసే ఛాన్స్ వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఎన్టీఆర్ టైటిల్ రోల్‌లో నటించిన దేవర బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించింది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీలోనూ, అలాగే ఓవర్‌సీస్ లోనూ అదరగొట్టేసింది. ప్రపంచవ్యాప్తంగా 510 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. తద్వారా ఇది ఎన్టీఆర్ కెరీర్‌లో ఫస్ట్ 500 కోట్ల మూవీగా నిలిచింది. అంతకుముందు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఈ రికార్డ్ అందుకున్నా.. సోలో హీరోగా మాత్రం ఇదే ప్రథమం. ఇటీవలే జపాన్ లోనూ రిలీజై మంచి ఆదరణ దక్కించుకుంది.
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా.. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించారు. అలాగే ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, అజయ్, గెటప్ శీను తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మించారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























