లిటిల్ వారియర్ ధైర్యంగా ఉండు అని మార్క్ శంకర్‌ని కోరారు స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా.. “సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ చిక్కుకున్నాడని విని బాధపడ్డాను. తను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. లిటిల్ వారియర్ ధైర్యంగా ఉండు! పవన్ కళ్యాణ్ గారు మరియు ఆయన కుటుంబ సభ్యులు ఈ సమయంలో ధైర్యంగా ఉండాలి. వారికోసం నేను ప్రార్ధిస్తున్నాను.” అని పేర్కొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ తాజాగా ప్రమాదంబారిన పడిన విషయం తెలిసిందే. సింగపూర్‌లో మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్‌లో అగ్నిప్రమాదం జరుగగా.. ఈ ఘటనలో అతడి చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులకు గురయ్యాడు. ప్రమాదం అనంతరం స్కూల్ యాజమాన్యం మార్క్ శంకర్‌ను ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం బాలుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: