గత వారంలో విడుదలైన మ్యాడ్ స్క్వేర్ సాలిడ్ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద డామినేషన్ కొనసాగిస్తుంది.కేవలం ఆరు రోజుల్లోనే 70 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకుంది.స్టార్ క్యాస్ట్ ఎవరు లేకుండా సీక్వెల్ ట్యాగ్ తో వచ్చిన ఈసినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.ఇప్పటివరకు 10 కోట్లకుపైగా లాభాలను తీసుకొచ్చింది.ఈవారంలో ఈసినిమా 100 కోట్ల క్లబ్ లో జాయిన్ కానుంది.ఆలెక్కన బయ్యర్ల పాలిట జాక్ పాట్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి మేకర్స్ సక్సెస్ మీట్ ప్లాన్ చేశారు. ఈఈవెంట్ కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా రానున్నాడు.ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ మ్యాడ్ స్క్వేర్ లో ఓ హీరోగా నటించాడు.రేపు శిల్పకళా వేదికలో ఈ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు.మ్యాడ్ కి సీక్వెల్ గా వచ్చిన ఈసినిమా లోకూడా కామెడీ వర్క్ అవుట్ కావడంతో థియేటర్లలో సూపర్ రన్ ను కొనసాగిస్తుంది.ఇప్పట్లో పెద్ద సినిమాల విడుదలకపోవడం అడ్వాంటేజ్ కానుంది.
యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈసినిమాలో నార్నె నితిన్,సంగీత్ శోభన్ ,రామ్ నితిన్ ,విష్ణు ఓయ్ లీడ్ రోల్స్ లో నటించగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు.సితార ఎంటర్టైన్మెంట్స్ ,శ్రీకరా స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మించాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























