
ట్యాగ్ · 609 కథనాలు · పేజీ 2


VD 12 కోసం ఎన్టీఆర్

త్వరలో అభిమానులను కలవనున్న ఎన్టీఆర్

ఎన్టీఆర్ వర్ధంతి.. తారక్, కళ్యాణ్ రామ్ నివాళులు

జపాన్‌లో రిలీజ్ అవుతోన్న దేవర

ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్ ట్రైలర్ వచ్చేసింది

వార్ 2 కోసం ముంబైకి ఎన్టీఆర్

ఆర్ఆర్ఆర్.. జపాన్‌లో సెన్సేషనల్ రన్

దేవర లాంగ్ రన్ కంటిన్యూ

దేవరకు ఎప్పటికీ నా హృదయంలో ప్రత్యేక స్థానం

10వ రోజు దేవర సెన్సేషన్

దేవర.. ఆ రికార్డ్ అందుకున్న ఎన్టీఆర్

ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సినిమాలన్నీ హిట్టే
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.. నిజమైన ఆల్ రౌండర్ అని చెప్పొచ్చు. యాక్టింగ్, డ్యాన్సింగ్, సింగింగ్, డైలాగ్ డెలివరీ.. ఇలా ఏదయినా ఆయనకు కొట్టిన పిండి. ఇవన్నీ ఆయనను ప్రజెంట్ జెనరేషన్ హీరోలలో భిన్నంగా చూపుతాయి. ముఖ్యంగా ఆయన ప్రత్యేకత ఏంటంటే..? డైలాగ్ మాడ్యులేషన్. తెలుగు భాషపై పట్టు కలిగిన తారక్ పలికే ప్రతి పదంలో స్పష్టత ఉంటుంది, ఒక ఫీల్ కలుగుతుంది.

VD 12 కోసం ఎన్టీఆర్
విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ రానుంది.సినిమా ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు ఒక్క మేజర్ అప్డేట్ కూడా ఇవ్వలేదు.దాంతో ఫ్యాన్స్ అసంతృప్తిగా వున్నారు.ఇక వారికీ కిక్ ఇచ్చే న్యూస్ వచ్చేసింది.ఈసినిమా టైటిల్ తోపాటు టీజర్ ను ఈనెల 12న రిలీజ్ చేయనున్నారు.ఈ టీజర్ కు స్టార్ హీరో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు.పాన్ ఇండియా సినిమా కావడంతో హిందీ టీజర్ కు రన్బీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు.

త్వరలో అభిమానులను కలవనున్న ఎన్టీఆర్
టాలీవుడ్ యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను ఉద్దేశించి కీలక విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అయన కార్యాలయం సోషల్ మీడియా వేదికగా ప్రెస్ నోట్ విడుదలచేసింది. కాగా తారక్ తన అభిమానులు కలిసి లేదా నేరుగా చూసి చాలా కాలం అవుతోంది. అప్పుడెప్పుడో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన 'ఆర్ఆర్ఆర్' విడుదల సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కలవడమే.

దేవర ఓటిటి రెస్పాన్స్ అదిరింది
గత ఏడాది సెప్టెంబర్ లో థియేటర్లలోకి వచ్చి 400 కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది దేవర.అంతేకాదు ఆ ఏడాది తెలుగులో పుష్ప 2, కల్కి తరువాత హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది.ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ లో నటించిన ఈసినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేశాడు.ఈసినిమా నవంబర్ 8న ఓటిటి లోకి వచ్చింది.నెట్ ఫ్లిక్స్ మొదట సౌత్ భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకురాగా తరువాత హిందీలో కూడా అందుబాటులోకి తెచ్చింది.ఇక ఓటిటి లో రిలీజై 10 వారాలకు పైగా అవుతున్న ఇప్పటికీ ఈసినిమా ట్రెండింగ్ లో కొనసాగుతుంది.నెట్ ఫ్లిక్స్ టాప్ 10 ఇండియన్ మూవీస్ లో దేవర ప్రస్తుతం 9వ స్థానం లో వుంది.ఓవరాల్ గా థియేటర్లలో సాలిడ్…

ఎన్టీఆర్‌తో సినిమా చేయాలనుంది - హాలీవుడ్ డైరెక్టర్
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయాలనుందని, తనతో ఒక సినిమా చేయాలనుందని మనసులో మాట వెలిబుచ్చారు 'సూపర్ మేన్' సినిమా ఫేమ్, ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ గన్. దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి నిర్మించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలో జూనియర్ నటనకు ముగ్ధుడనయ్యానని, అప్పుడే ఆయనతో ఓ సినిమా చేయాలనే ఆలోచనకు వచ్చినట్లు జేమ్స్ తెలిపారు.

ఎన్టీఆర్ వర్ధంతి.. తారక్, కళ్యాణ్ రామ్ నివాళులు
లెజెండరీ యాక్టర్, నటసార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా.. ఆయన మనవలు, స్టార్ నటులు జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ నివాళులర్పించారు. ఈ మేరకు ఈ ఉదయం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ ఘాట్‌లోని ఆయన సమాధి వద్దకు చేరుకున్న నట సోదర ద్వయం తాతకు పుష్పాంజలి ఘటించారు.

సైఫ్ అలీఖాన్‌పై ఆగంతకుడి దాడి.. స్పందించిన ఎన్టీఆర్
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేసాడు. ముంబైలోని ఆయన నివాసంలోకి చొరబడిన దుండగుడు కత్తితో సైఫ్‌పై దాడికి పాల్పడ్డాడు. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఆయనకు ఆరు చోట్ల గాయాలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు సైఫ్‌ను హుటాహుటిన లీలావతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఓటీటీలోకి వచ్చేసిన ఆర్‌ఆర్‌ఆర్ డాక్యుమెంటరీ
ఇండియా గర్వించదగ్గ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. కేవలం మనదేశంలోనే కాకుండా వరల్డ్ వైడ్‌గా కోట్లాదిమందిని అలరించి సెన్సేషన్ సృష్టించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ సహా అత్యంత ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును సైతం గెలుపొంది అంతర్జాతీయ వేదికలపై భారతీయ సినిమా ఖ్యాతిని పెంచింది.

జపాన్‌లో రిలీజ్ అవుతోన్న దేవర
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్‌లో నటించిన లేటెస్ట్ మూవీ 'దేవర'. విడుదలకు ముందే భారీ హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించింది. ఈ క్రమంలో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది, మరెన్నో రికార్డులను సృష్టించింది. విడుదలకు ముందే భారీ హైప్ తెచ్చుకున్న దేవర చిత్రం అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించింది. అయితే తొలి రెండు, మూడు రోజులు కొంత మిక్స్‌డ్ టాక్ వచ్చినా ఆ తర్వాత ఎన్టీఆర్ స్టామినా ఏంటో చూపించింది.

ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్ ట్రైలర్ వచ్చేసింది
దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సూపర్ పాపులారిటీ తెచ్చుకుంది. అలాగే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ సహా ఆస్కార్ అవార్డును సైతం గెలుపొంది అంతర్జాతీయ వేదికలపై భారతీయ సినిమా ఖ్యాతిని పెంచింది.

దేవర.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్‌లో నటించిన లేటెస్ట్ మూవీ 'దేవర'. తారక్ సోలో హీరోగా వచ్చి దాదాపు ఆరేళ్ళు కావడం, అలాగే 'ఆర్ఆర్ఆర్' తర్వాత స్క్రీన్ పైన కనిపించి రెండేళ్లకు పైగా అవడంతో ఆయన అభిమానులు సినిమా చూసేందుకు థియేటర్లకు పరుగులుతీశారు.

బావమరిది నిశ్చితార్థం.. ఫ్యామిలీతో హాజరైన ఎన్టీఆర్
టాలీవుడ్ యంగ్ హీరో 'మ్యాడ్' ఫేమ్ నార్నే నితిన్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆదివారం ఆయన నిశ్చితార్థం శివాని తాళ్లూరితో జరిగింది. హైదరాబాద్‌లో ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో ఈ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ స్టార్ హీరో జూ. ఎన్టీఆర్ ఫ్యామిలీతో సహా హాజరై సందడి చేసారు.

హీరోగా అన్న కొడుకు ఎంట్రీ.. వెల్‌కమ్ చెప్పిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
దివంగత లెజెండరీ నటుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత జానకీరామ్ తనయుడైన యంగ్ చాప్ నందమూరి తారక రామారావు ఫిలిమ్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు డైనమిక్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి రచన, దర్శకత్వం వహిస్తున్నారు.

వార్ 2 కోసం ముంబైకి ఎన్టీఆర్
ఇన్ని రోజులు దేవర సక్సెస్ ను ఎంజాయ్ చేసిన ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమా వార్ 2 షూటింగ్ లో బిజీ అవుతున్నాడు.అందులో భాగంగా రీసెంట్ గా ఓ మినీ షెడ్యూల్ ను పూర్తి చేసిన ఎన్టీఆర్ ఈ రోజు మళ్ళీ మరో షెడ్యూల్ కోసం ముంబై వెళ్ళాడు.వచ్చే వారం వరకు ఈ షెడ్యూల్ జరుగనుందని టాక్.మరోవైపు హృతిక్ రోషన్ తన పార్ట్ సంబంధించిన షూటింగ్ ను ఫాస్ట్ గా ఫినిష్ చేస్తున్నాడు.వార్ 2లో ఎన్టీఆర్ ,హృతిక్ హోరాహోరిగా తలపడనున్నారని తెలిసిందే.బ్రహ్మాస్త్రం ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా యాష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది ఆగస్టు 15న ఈసినిమాను థియేటర్లలోకి తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

ఆర్ఆర్ఆర్.. జపాన్‌లో సెన్సేషనల్ రన్
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' (రౌద్రం రణం రుధిరం) చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఎన్నో సంచలనాలను సృష్టించిన విషయం తెలిసిందే. వసూళ్లపరంగానే కాకుండా అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సైతం సాధించింది. ఉత్తమ జాతీయ చిత్రం పురస్కారం సహా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు మరియు గోల్డెన్ గ్లోబ్ వంటి అవార్డులను గెలుచుకుంది.

దేవర లాంగ్ రన్ కంటిన్యూ
ఎన్టీఆర్ -కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన దేవర మూడో వారంలో కూడా సాలిడ్ వసూళ్లను సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద డామినేషన్ ను కొనసాగిస్తోంది. వరసగా 19రోజులు తెలుగు రాష్ట్రాల్లో కోటి రూపాయలకు మించి షేర్ ను రాబట్టింది.దాంతో బాహుబలి 2(28)బాహుబలి(20) ,హనుమాన్(20) తర్వాత వరుసగా అత్యధిక రోజులు కోటి రూపాయల కు మించి షేర్ ను రాబట్టిన సినిమాగా రికార్డు నెలకొల్పింది.అయితే నిన్న భారీ వర్షాల కారణంగా కోటి మిస్ అయ్యింది.

దేవరకు ఎప్పటికీ నా హృదయంలో ప్రత్యేక స్థానం
దేవర సినిమాకు ఎప్పటికీ తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుందని పేర్కొన్నారు మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సెప్టెంబర్ 27న పాన్ ఇండియా లెవెల్లో థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ స్టామినా ఏంటో చూపుతూ ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.

10వ రోజు దేవర సెన్సేషన్
బాక్సాఫీస్ వద్ద దేవర హవా కొనసాగుతుంది.వేరే సినిమాలనుండి పోటీ లేకపోవడం దసరా సెలవులు స్టార్ట్ కావడంతో సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది.నిన్న అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎక్సెలెంట్ గ్రోత్ చూపించింది.చాలా చోట్ల నైట్ షోస్ హౌస్ ఫుల్ అయ్యాయి.దాంతో దాదాపు 12 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.10రోజుల్లో ఈసినిమా రెండు రాష్ట్రాల్లో కలిపి 140కోట్ల షేర్ ను రాబట్టి భారీ లాభాలను తీసుకొస్తుంది.ఈవారం కూడా సాలిడ్ రన్ కన్ ఫర్మ్ మే.ఇక తెలుగు తరువాత హిందీ లో ఈసినిమా అదరగొడుతుంది.నిన్న నార్త్ లో 4.20కోట్ల నెట్ ను రాబట్టుకుంది.దాంతో10రోజుల్లో అక్కడ 58.47కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.ఫుల్ రన్ లో 100కోట్ల క్లబ్ లో…

దేవర.. ఆ రికార్డ్ అందుకున్న ఎన్టీఆర్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్‌లో నటించిన లేటెస్ట్ మూవీ 'దేవర'. తారక్ సోలో హీరోగా వచ్చి దాదాపు ఆరేళ్ళు కావడం, అలాగే 'ఆర్ఆర్ఆర్' తర్వాత స్క్రీన్ పైన కనిపించి రెండేళ్లకు పైగా అవడంతో ఆయన అభిమానులు సినిమా చూసేందుకు థియేటర్లకు పరుగులుతీశారు. విడుదలకు ముందే భారీ హైప్ తెచ్చుకున్న దేవర చిత్రం అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది.

దేవర.. ఆడియెన్స్‌కు గుడ్‌న్యూస్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్‌లో నటించిన లేటెస్ట్ మూవీ 'దేవర'. తారక్ సోలో హీరోగా వచ్చి దాదాపు ఆరేళ్ళు కావడం, అలాగే 'ఆర్ఆర్ఆర్' తర్వాత స్క్రీన్ పైన కనిపించి రెండేళ్లకు పైగా అవడంతో ఆయన అభిమానులు సినిమా చూసేందుకు థియేటర్లకు పరుగులుతీశారు. విడుదలకు ముందే భారీ హైప్ తెచ్చుకున్న దేవర చిత్రం అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది.