గత ఏడాది సెప్టెంబర్ లో థియేటర్లలోకి వచ్చి 400 కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది దేవర ఫస్ట్ పార్ట్.ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ లో నటించిన ఈసినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేశాడు.థియేట్రికల్ రిలీజ్ తరువాత ఓటిటి లోకి రాగ అక్కడ కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈసినిమా జపాన్ లో విడుదలకానుంది. ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ కి జపాన్ లో ఫాలోయింగ్ వచ్చింది.దాంతో దేవరను జపనీస్ లో విడుదలచేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా ఎన్టీఆర్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు. ఈరోజు అక్కడి మీడియా తో సినిమా గురించి వర్చువల్ గా మాట్లాడాడు.ప్రస్తుతం అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అంతేకాదు మార్చి 22న ఎన్టీఆర్ స్వయంగా జపాన్ వెళ్లి ప్రమోట్ చేయనున్నాడు.వచ్చే నెల 25న ఈసినిమా విడుదలకానుంది.మరి జపాన్ ప్రేక్షకులు ఈసినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించాడు.అనిరుధ్ సంగీతం సినిమా విజయంలో కీ రోల్ ప్లే చేసింది.యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మించాయి.ఇక ఈసినిమాకు సీక్వెల్ గా దేవర 2 కూడా రానుంది.
ఇదిలా ఉంటే రీసెంట్ గా ఎన్టీఆర్ నీల్ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది.ప్రస్తుతం మొదటి షెడ్యూల్ జరుగుతుంది.అయితే ఇందులో ఎన్టీఆర్ జాయిన్ అవ్వలేదు.సెకండ్ షెడ్యూల్ నుండి షూటింగ్ లో పాల్గొనున్నాడు.ప్రశాంత్ నీల్ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది జనవరి 9న విడుదలకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: