కాంతారతో పాన్ ఇండియా బ్లాక్బస్టర్ అందుకున్న రిషబ్ శెట్టి మోస్ట్ ఎవైటెడ్ ప్రీక్వెల్ కాంతార: చాప్టర్ 1తో రాబోతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన స్వయంగా దర్శకత్వం వహించి, నటించారు. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అన్ని భాషలలో హ్యుజ్ బజ్ క్రియేట్ అంచనాలను భారీగా పెంచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రఖ్యాత పాన్-ఇండియా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న దసరాకు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ హైదరాబాద్ వేదికగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్గా జరిగింది.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. “ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, శ్రేయోభిలాషులకు, కాంతార చిత్ర బృందానికి, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన నా అభిమాన సోదరులందరికీ నమస్కారాలు. మా అమ్మమ్మ నాకు చిన్నప్పుడు నుంచే కొన్ని కథలు చెప్పడం మొదలు పెట్టింది. అప్పుడు నిజంగా జరుగుతుందా? ఈ కథ నిజమేనా, కాదా ? ఇలా ఎన్నో డౌట్లు. కానీ అవి బాగా నచ్చేవి. ఆవిడ చెప్పినప్పుడల్లా చాలా ఇంట్రెస్ట్ వచ్చేది.”
“ఆ పంజుర్లి, గుడి ఘాట్ చిన్నప్పుడు నుంచి నాటుకు పోయింది. కానీ ఏనాడు అనుకోలేదు. చిన్నప్పుడు నేను విన్న ఆ కథల గురించి ఒక దర్శకుడు సినిమా తీస్తాడని. అతను మరెవరో కాదు, నా బ్రదర్ రిషబ్ శెట్టి. నేను చిన్నప్పుడు విన్న కథ తెరపై చూసినప్పుడు నాకు మాటలు రాలేదు. కథ తెలిసిన నేనే అంత ఆశ్చర్య పోతే ఆ కథ తెలియని వాళ్ళు చూసి ఏమయ్యారో అదే కాంతార రిజల్ట్. చాలా అరుదైన దర్శకుడు రిషబ్.”
“24 క్రాఫ్ట్ లో అన్ని క్రాఫ్ట్స్ ని ఆయన డామినేట్ చేయగలరు. రిషబ్ గారే లేకపోతే నిజంగా ఈ సినిమాని ఈ లెవెల్ లో తీయగలిగేవారా అనిపిస్తుంది. ఉడిపి కృష్ణుడు గుడికి తీసుకెళ్లాలని మా అమ్మ కోరిక. రిషబ్ లేకపోతే ఆ దర్శనం అలా అయ్యేది కాదు. ఆ భాగ్యం కలిగేది కాదు. పనులన్నీ మానుకొని కుటుంబ సభ్యులు లాగా మాతో వచ్చారు. సొంత కుటుంబ సభ్యులు లాగా చూసుకున్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు కాంతార చాప్టర్ వన్ కోసం ఆయన ఎంత కష్టపడుతున్నారో చూసే అవకాశం దొరికింది.”
“ఈ సినిమా తీయడం అంత ఈజీ కాదు. ఒక గుడికి తీసుకెళ్లారు. నిజానికి ఆ గుడికి వెళ్ళడానికి మార్గమే లేదు. అలాంటి మార్గాన్ని క్రియేట్ చేసుకున్నారు. కాంతార రిషబ్ శెట్టి గారి డ్రీమ్. ఈ డ్రీమ్ ని ఫుల్ ఫిల్ చేయడానికి హోంబలే ఫిల్మ్స్ సపోర్ట్ చేశారు. ఇండియన్ ఫిలిమ్స్ లో ఒక గొప్ప బ్లాక్ బాస్టర్ చిత్రంగా ఈ చిత్రం ప్రస్ఫుటంగా కనబడాలని మనస్పూర్తిగా దేవున్ని కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన రిషబ్ గారిని కాంతారా టీం ని ఆశీర్వదించినందుకు మీ అందరికీ మనస్పూర్తిగా నా ధన్యవాదాలు.”
“ఈ స్టేజ్ మీద మై డియర్ ఫ్రెండ్ ప్రశాంత్ కూడా ఉంటే బాగుండేది. ఈ సినిమా బిగ్ బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుంది. అక్టోబర్ 2న తప్పకుండా ధియేటర్ కి వెళ్లి చూడండి. దయచేసి థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి. మా రిషబ్ గారికి ఆయన పడిన కష్టానికి మీరందరూ ఆశీర్వాదం అందించండి. అందరికీ థాంక్యూ.” అని అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























