ఎలాంటి అఫీషియల్ అప్డేట్స్ లేకుండా సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటుంది వార్ 2.ఇందులో హృతిక్ రోషన్ ,ఎన్టీఆర్ నటిస్తున్నారు.ప్రస్తుతం ముంబై లో లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది.ఇందులో నిన్నటి నుండి ఎన్టీఆర్ ,హృతిక్ లపై పాటను చిత్రీకరిస్తున్నారు.బోస్కో మార్టిస్ కొరియోగ్రఫీలో సుమారు 500 మంది జూనియర్ ఆర్టిస్టులు ఈ సాంగ్ షూట్ లో పాల్గొంటున్నారు.ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ కంప్లీట్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరి ఆ తరువాతైనా అఫీషియల్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.బ్రహ్మస్త్రం ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది.ఈ ఏడాది ఆగస్టు 14న వార్ 2 ను థియేటర్లలోకి తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఎన్టీఆర్ ఈసినిమాను పూర్తి చేసి ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమాలో జాయిన్ కానున్నాడు.రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం ఎన్టీఆర్ లేకుండా చిత్రీకరణ జరుపుకుతుంటుంది.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.సెప్టెంబర్ లోపు షూటింగ్ కంప్లీట్ చేసి అనుకున్న డేట్ ప్రకారం వచ్చే ఏడాది జనవరి 9న రిలీజ్ చేయాలని చూస్తున్నారు.రవి బసృర్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్,ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈసినిమాను నిర్మిస్తున్నాయి.
ఇక ఈసినిమా తరువాత ఎన్టీఆర్ ,దేవర 2ను మొదలు పెట్టనున్నాడు.గత ఏడాది వచ్చిన దేవర ఫస్ట్ పార్ట్ 400 కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ప్రస్తుతం డైరెక్టర్ కొరటాల శివ దేవర 2 స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో వున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: