రాసి పెట్టుకోండి, ఆఖరి 20 నిమిషాలు మాత్రం.. ఎన్టీఆర్

NTR Says, Arjun SO Vyjayanthi Last 20 Minutes of Climax Will be Mind Blowing

నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ అర్జున్ S/O వైజయంతి. ఈ చిత్రంలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఈ రెండు పాత్రలు మధ్య డైనమిక్స్ కీలకంగా వుండబోతున్నాయి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక అర్జున్ S/O వైజయంతి టీజర్, సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ మ్యాసీవ్ ప్రీరిలీజ్ & ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్ లో చిత్ర యూనిట్ అంతా పాల్గొన్నారు.

ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. “ఇక్కడికి విచ్చేసిన అభిమాన సోదరులందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు, అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా బృందానికి అందరికీ కూడా నా నమస్కారాలు. ఈ వేదిక పైన నేను అన్న నిలుచున్నప్పుడు నాన్నగారు చాలా సార్లు వచ్చి మాట్లాడడం జరిగింది.”

“ఈరోజు నాన్నగారు లేని లోటు తీరినట్లు అయింది విజయశాంతి గారు మాట్లాడుతుంటే. ఈవెంట్ లో నాన్నగారు ఉంటే ఎలా ఉండేదో విజయశాంతి గారు మాట్లాడుతూ ఉంటే ఆ లోటు నాకు భర్తీ అయిపోయింది. చాలామంది గొప్ప సినిమాలు చేసి అద్భుతంగా అలరించారు. కానీ విజయశాంతి గారు సాధించినటువంటి గొప్పతనం ఏ మహిళ సాధించలేదు.”

“కర్తవ్యం, ప్రతిఘటన, మగరాయుడు ఇలా ఎన్నో వైవిధ్యమైనటువంటి పాత్రలు చేశారు. నాకు తెలిసి భారత దేశంలో ఏ నటి విజయశాంతి గారి లాంటి వైవిధ్యమైనటువంటి పాత్రలు చేయలేదు. ఆ ఘనత ఆవిడ ఒక్కరికే దక్కింది. భారతదేశ చలనచిత్ర పటంలో హీరోలకి సమానంగా నిలుచున్న ఏకైక మహిళ విజయశాంతి గారే. ఈ చిత్రం ఆలోచన కూడా కర్తవ్యంలో ఉన్న పాత్రకు ఒక కొడుకు పుడితే ఎలా ఉంటుందో అనే ఆలోచన నుంచే మొదలయింటుందని భావిస్తున్నాను.”

“ఈ వేడుకకు రావడం అభిమానులందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా నేను చూశాను. విజయశాంతి గారు లేకపోతే ఈ సినిమా లేదు. పృథ్వి గారు లేకపోతే, సోహెల్ లేకపోతే ఈ సినిమా లేదు. ప్రదీప్ చిలుకూరి డైరెక్టర్ కాకపోతే ఈ సినిమా లేదు. సునీల్ గారు అశోక్ గారు ప్రొడ్యూసర్స్ లేకపోతే ఈ సినిమా లేదు. ఒక్కొక్కళ్ళు ప్రాణం పెట్టి ఈ సినిమాకు పని చేశారు. సినిమా చుసిన నాకు తెలుసు ఈ సినిమాని వాళ్ళు ఎంత నమ్మారో.”

” రాసి పెట్టుకోండి. ఆఖరి 20 నిమిషాలు థియేటర్స్ లో కూర్చున్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అంత అద్భుతంగా మలిచారు. ప్రతిసారి కాలర్ ఎగరేయమని నేను చెప్తుంటాను. ఈసారి కళ్యాణ్ అన్న కాలర్‌ని నేను ఎగరేస్తున్నాను. కళ్ళ నుంచి నీళ్లు ఆపుకోవడం నావల్ల కాలేదు. రేపొద్దున్న మీ అందరికీ అర్థమవుతుంది. ఆ ఆఖరి 20 నిమిషాలు అలా రావడానికి కారణం కళ్యాణ్ అన్న మాత్రమే. ఆయన ఆ ఆలోచనని నమ్మక పోయి ఉంటే. ఒక ప్రేక్షకుడిగా నేను ఎంజాయ్ చేసే వాడిని కాదు.”

“ఆయన నమ్మి డెడికేటెడ్ గా వర్క్ చేశారు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కళ్యాణ్ అన్న కెరీర్ లో ఒక స్పెషల్ మూవీగా నిలిచిపోతుంది. విజయశాంతి గారిని అమ్మ అని నమ్మేసి చేశారు. తల్లిగా నమ్మేశారు కాబట్టే అంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేయడం జరిగింది. ఈ సినిమాలో సాంకేతిక నిపుణులకు నటీనటులందరికీ నా అభినందనలు. ఏప్రిల్ 18న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా రిలీజ్ కాబోతుంది. అభిమానులు మీరు కూడా సినిమా చూసి ఎంజాయ్ చేయండి.” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.