వార్ 2 నుండి ఎట్టకేలకు అఫీషియల్ గా ఓ అప్డేట్ వచ్చింది.సినిమా ప్రారంభమైనప్పటి నుండి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.మే లోపు బ్యాలెన్స్ షూట్ కంప్లీట్ కానుంది.ఆతరువాత నాన్ స్టాప్ ప్రమోషన్స్ చేయాలని చూస్తున్నారు.ఇందులో హృతిక్ రోషన్ తోపాటు ఎన్టీఆర్ నటిస్తుండడంతో తెలుగులోనూ ఈసినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హిందీ లో ఎన్టీఆర్ కు ఇదే మొదటి సినిమా.ఇంతకుముందు ఆర్ఆర్ఆర్ ,దేవర తో అక్కడ మంచి క్రేజ్ ను తెచ్చుకున్నాడు. ఇక ఈసినిమా రిలీజ్ విషయంలో అధికారిక ప్రకటన చేసింది నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్.ఆగస్టు 14న ఈసినిమా విడుదలకానుందని ప్రకటించింది. బ్రహ్మస్త్రం ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.
ఇక ఎన్టీఆర్ ఈసినిమాను పూర్తి చేసి ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమాలో జాయిన్ కానున్నాడు.రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఎన్టీఆర్ లేకుండానే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.సెప్టెంబర్ లోపు షూటింగ్ కంప్లీట్ చేసి ముందు చెప్పిన డేట్ ప్రకారం వచ్చే ఏడాది జనవరి 9న రిలీజ్ చేయాలని చూస్తున్నారు. భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్,ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈసినిమాను నిర్మిస్తున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: