ట్యాగ్ · 139 కథనాలు · పేజీ 7
"ఎన్టీఆర్ 30" లో మరో యంగ్ హీరో ?
స్టైలిష్ బిజినెస్ మెన్ గా ఎన్టీఆర్
మలయాళ భాష ప్రాక్టీస్ లో ఎన్టీఆర్
"బీ ది రియల్ మెన్ " ఛాలెంజ్ లో ఎన్టీఆర్
యన్టీఆర్ పుట్టినరోజున డబుల్ ట్రీట్?

స్టార్ డైరెక్టర్లతోనే యన్టీఆర్ వరుస చిత్రాలు
పెళ్లి చూపులు డైరెక్టర్ తో ఎన్టీఆర్ సినిమా...?
యన్టీఆర్‌తో జాన్వీ కపూర్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్వంత ప్రొడక్షన్ హౌస్ ?

మహేష్,రామ్ చరణ్ బాటలో ఎన్టీఆర్ కూడా..!

రెండేళ్ళ బాకీ తీరుస్తున్న యన్టీఆర్

యువ ముఖ్యమంత్రి పాత్రలో యంగ్ టైగర్?

`అసురన్` దర్శకుడితో యన్టీఆర్?

RRR మూవీ లో ఎన్టీఆర్ రొమాంటిక్ సీన్స్ హై లైట్
తన స్టాఫ్ కు అండగా నిలిచిన ఎన్టీఆర్..!
కరోనా నిర్మూలనలో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు...రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నాయి. వాటితో పాటు పేదలకు అండగా నిలుస్తూ ఉదారత చాటుకుంటున్నారు చాలా మంది ప్రముఖులు. కేవలం సెలబ్రిటీస్ మాత్రమే కాదు.. సామాన్య ప్రజలు కూడా తమ స్థోమతకు తగిన విధంగా సాయం అందించడానికి ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే సినీ కార్మికుల కోసం చిరంజీవి కరోనా క్రైసిస్ ఛారిటీ పేరుతో సాయం అందిస్తున్నారు.
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా ఇంట్రెస్టింగ్ అప్ డేట్
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా... ఈ కాంబినేషన్ లో సినిమా అంటూ ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీ గా వున్నాడు. ఈ సినిమా అయిపోయిన వెంటనే త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడు. ఈవిషయాన్ని ఇప్పటికే ప్రకటించేశారు కూడా. స్క్రిప్ట్ వర్క్ తో త్రివిక్రమ్ బిజీగా వున్నాడు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా ఉంటుందంటున్నారు. ఈ విషయంలో క్లారిటీ అయితే రాలేదు కానీ రోజుకో వార్త మాత్రం వినిపిస్తూనే ఉంటుంది. ఇప్పటీకే ఎన్నో వార్తలు రాగా ఇప్పుడు తాజాగా మరో…
పీరియాడికల్ డ్రామాగా ఎన్టీఆర్ 31 మూవీ.. విలన్ గా రణవీర్ సింగ్..?
స్టార్ హీరో సినిమా అంటే రూమర్స్ రావడం కామన్ థింగ్. ఏం చేసిన వాటిని ఆపడం కష్టం. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ పై కూడా అలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటే బయటకు వచ్చింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీ గా ఉన్నాడు. గత రెండేళ్లుగా మొదలైన ఈ సినిమా షూటింగ్ ఇంకా జరుపుకుంటూనే ఉంది. దాదాపు చివరి దశకు రాగా కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది.
"ఎన్టీఆర్ 30" లో మరో యంగ్ హీరో ?
హారిక &హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా "ఎన్టీఆర్ 30" మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. "రౌద్రం రణం రుధిరం " మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత ప్రారంభం అయ్యే ఈ మూవీ లో ఒక యంగ్ హీరో కీలక పాత్రలో నటించనున్నారని సమాచారం. దర్శకుడు త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నారు.
స్టైలిష్ బిజినెస్ మెన్ గా ఎన్టీఆర్
ఎటువంటి పాత్రనైనా తనదైన స్టైల్ లో రక్తి కట్టించే జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్, భారీ తారాగణం తో రూపొందుతున్న "రౌద్రం రణం రుధిరం" మూవీ లో ట్రైబల్ లీడర్ కొమరం భీమ్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తున్నారని సమాచారం. "RRR"మూవీ తరువాత ఎన్టీఆర్ మరోమూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
మలయాళ భాష ప్రాక్టీస్ లో ఎన్టీఆర్
స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న "రౌద్రం రణం రుధిరం" మూవీ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది. అన్ని భాషలలోనూ తన పాత్ర కు తానే డబ్బింగ్ చెప్పుకోవాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారు. హీరో రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన "RRR" మూవీ వీడియో కి ఒక్క మలయాళ భాషలో తప్ప మిగతా భాషలన్నిటికీ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.
"బీ ది రియల్ మెన్ " ఛాలెంజ్ లో ఎన్టీఆర్
బ్లాక్ బస్టర్ "అర్జున్ రెడ్డి"మూవీ ఫేమ్ సందీప్ రెడ్డి వంగ , ఇళ్ళను శుభ్రపరచడంలో మహిళల కంటే పురుషులు ఏ మాత్రం తీసిపోరు అనే "బీ ది రియల్ మెన్ " ఛాలెంజ్ ను స్టార్ డైరెక్టర్ రాజమౌళి ని సవాల్ చేశారు. ఆ సవాల్ ను స్వీకరించి తన ఇంటిని క్లీన్ చేస్తున్న వీడియో ను పోస్ట్ చేస్తూ ఆ సవాల్ ను ఎన్టీఆర్, రామ్ చరణ్, శోభు యార్లగడ్డ, సుకుమార్, కీరవాణి లకు రాజమౌళి విసిరారు.
యన్టీఆర్ పుట్టినరోజున డబుల్ ట్రీట్?
మే 20.. యంగ్ టైగర్ యన్టీఆర్ అభిమానులకు వెరీ స్పెషల్ డే. ఎందుకంటే.. ఆ రోజు తారక్ పుట్టినరోజు. అభిమానులకు పండగ రోజు. అలాంటి రోజున తారక్ నుంచి ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ అందనుందని సమాచారం.

స్టార్ డైరెక్టర్లతోనే యన్టీఆర్ వరుస చిత్రాలు
యంగ్ టైగర్ యన్టీఆర్ ఈ మధ్య సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మరీ ముఖ్యంగా ‘అరవింద సమేత’ నుంచి అగ్ర దర్శకులతోనే వరుస చిత్రాలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ప్రీవియస్ మూవీ ‘అరవింద సమేత’ని సెల్యూలాయిడ్ తాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో చేసిన తారక్.. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ‘ఆర్ ఆర్ ఆర్’(‘రౌద్రం రణం రుధిరం’) ని దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్‌లో చేస్తున్నారు. మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ పేట్రియాటిక్ డ్రామా.. 2021 సంక్రాంతికి రిలీజ్ కానుంది. కాగా, ఈ చిత్రం తరువాత తారక్ నుంచి రాబోతున్న సినిమాలు కూడా అగ్ర దర్శకుల కలయికలోనే…
పెళ్లి చూపులు డైరెక్టర్ తో ఎన్టీఆర్ సినిమా...?
మొదటి సినిమా పెళ్లి చూపులు సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యువ దర్శకుడు తరుణ్ భాస్కర్. ఇక పెళ్ళిచూపులు సినిమా తర్వాత ఈ నగరానికి ఏమైంది? సినిమా తీసాడు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిందనుకోండి. మధ్యలో ఫలక్ నుమా దాస్ సినిమాలో పోలీస్ పాత్రలో నటించగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమా తర్వాత తానే హీరోగా 'మీకు మాత్రమే చెప్తా' సినిమా కూడా తీసాడు. ఇక తన తరువాత సినిమా వెంకీ ఉన్నట్టు ఇటీవలే వార్తలు కూడా వచ్చాయి.
యన్టీఆర్‌తో జాన్వీ కపూర్?
`అరవింద సమేత` వంటి విజయవంతమైన చిత్రం తరువాత యంగ్ టైగర్ యన్టీఆర్, సెల్యులాయిడ్ తాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న విషయం విదితమే. హారికా అండ్ హాసిని క్రియేషన్స్, యన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ మే నెలలో సెట్స్ పైకి వెళ్ళనుంది. అలాగే వచ్చే ఏడాది ఏప్రిల్‌లో వేసవి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్వంత ప్రొడక్షన్ హౌస్ ?
"యంగ్ టైగర్" అంటూ ప్రేక్షక, అభిమానులచే ముద్దుగా పిలిపించుకునే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మల్టీ స్టారర్ "RRR" మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న మూవీ షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొంటారు.

మహేష్,రామ్ చరణ్ బాటలో ఎన్టీఆర్ కూడా..!
టాలీవుడ్ హీరోలు ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతలుగా మారడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరోలు తమ సొంత ప్రొడక్షన్స్ నే పెట్టుకోవడానికి ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు జిఏంబి ఎంటర్టైన్మెంట్స్ పేరిట సొంత బ్యానర్ ను స్థాపించి వరసగా తన సినిమాల్లో భాగస్వామిగా ఉంటున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్, ప్రభాస్, రామ్ చరణ్, నాని, నితిన్, కళ్యాణ్ రామ్, నాగశౌర్య ఇలా చాలా మంది హీరోలు అటు సినిమాల్లో నటిస్తూ.. ఇటు నిర్మాణ రంగంలోనూ దూసుకుపోతున్నారు.

రెండేళ్ళ బాకీ తీరుస్తున్న యన్టీఆర్
కథానాయకుడిగా తొలి అడుగేసిన సంవత్సరంలోనే ముచ్చటగా మూడు సినిమాలు చేసి మురిపించిన వైనం యంగ్ టైగర్ యన్టీఆర్ సొంతం. ఆపై ఏడాదికి కనీసం రెండు సినిమాలైనా రిలీజయ్యేలా ప్లాన్ చేసుకునేవాడు ఈ యాక్టింగ్ పవర్ హౌస్. అయితే, తొలిసారిగా 2009ని `జీరో రిలీజ్ ఇయర్`గా సరిపెట్టాడు తారక్. ఆ తరువాత మళ్ళీ గ్యాప్ తీసుకోని ఈ నందమూరి హ్యాండ్సమ్ హీరో.. కుదిరితే సంవత్సరానికి రెండు సినిమాలు లేదంటే కనీసం ఒక చిత్రమైనా చేస్తూ మురిపిస్తూ వచ్చాడు.

యువ ముఖ్యమంత్రి పాత్రలో యంగ్ టైగర్?
ఒకవైపు మల్టీస్టారర్ మూవీ `ఆర్ ఆర్ ఆర్`తో బిజీగా ఉంటూనే... మరోవైపు కొత్త చిత్రానికి సన్నద్ధమవుతున్నాడు యంగ్ టైగర్ యన్టీఆర్. తన లక్కీ డైరెక్టర్స్ లో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని చేయబోతున్నాడు తారక్. అంతేకాదు.. `అయినను పోయిరావాలె హస్తినకు` అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ భారీ బడ్జెట్ మూవీ... పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుందని ప్రచారం సాగుతోంది. అలాగే.. ఇందులో యువ ముఖ్యమంత్రిగా యన్టీఆర్ కనిపిస్తాడని కథనాలు వస్తున్నాయి.

`అసురన్` దర్శకుడితో యన్టీఆర్?
యంగ్ టైగర్ యన్టీఆర్ ప్రస్తుతం `డైరెక్టర్ నంబర్ వన్` రాజమౌళి రూపొందిస్తున్న `ఆర్ ఆర్ ఆర్`తో బిజీగా ఉన్నాడు. 2021 సంక్రాంతికి ఈ పేట్రియాటిక్ డ్రామా థియేటర్లలో సందడి చేయనుంది. ఈలోపే సెల్యులాయిడ్ తాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ మూవీని పట్టాలెక్కించబోతున్నాడు యన్టీఆర్. `అయినను పోయి రావాలె హస్తినకు` పేరుతో ఈ సినిమా రూపొందనుందని టాక్. అంతేకాదు.. మరో క్రేజీ ప్రాజెక్ట్ కి కూడా తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వినిపిస్తోంది.

యన్టీఆర్ `అదుర్స్`కి పదేళ్ళు... `నాన్నకు ప్రేమతో`కి నాలుగేళ్ళు..
తన కెరీర్ మొత్తమ్మీద యంగ్ టైగర్ యన్టీఆర్.. ఇప్పటివరకు ఐదు సంక్రాంతి రిలీజెస్ చూశాడు. ఆ చిత్రాలే.. `నాగ`(2003), `ఆంధ్రావాలా` (2004), `నా అల్లుడు` (2005), అదుర్స్ (2010), `నాన్నకు ప్రేమతో`(2016). వీటిలో చివరి రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. విశేషమేమిటంటే... ఈ రెండు మూవీస్ కూడా వేర్వేరు సంవత్సరాల్లో ఒకే తేదిన(జనవరి 13) విడుదలయ్యాయి.

RRR మూవీ లో ఎన్టీఆర్ రొమాంటిక్ సీన్స్ హై లైట్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ కథానాయకులుగా రూపొందుతున్న RRR మూవీ 2020 సంవత్సరం జులై 30 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ కథానాయికలు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, నటుడు,దర్శకుడు సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందించారు.
తలైవి మూవీ లో సీనియర్ ఎన్టీఆర్ గా జూనియర్ ఎన్టీఆర్ ?
విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ నిర్మాణ సారథ్యం లో లెజండరీ యాక్ట్రెస్, తమిళనాడు దివంగత ముఖ్య మంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న తలైవి మూవీ షూటింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో జయలలిత పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్, లెజండరీ యాక్టర్, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఎమ్ జి రామచంద్రన్ పాత్రలో ట్యాలెంటెడ్ యాక్టర్ అరవింద్ స్వామి నటిస్తున్నారు. ఇతర పాత్రలలో ప్రముఖ నటీనటులు నటించనున్నారు.