య‌న్టీఆర్ `అదుర్స్`కి ప‌దేళ్ళు… `నాన్న‌కు ప్రేమ‌తో`కి నాలుగేళ్ళు..

Adhurs Movie Updates, Adhurs Telugu Movie Latest News, Jr NTR Adhurs And Nannaku Prematho Released On This Same Date, Jr NTR Latest News, Latest Telugu Movies News, Nannaku Prematho Movie Updates, Nannaku Prematho Telugu Movie Latest News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

త‌న కెరీర్ మొత్త‌మ్మీద యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్.. ఇప్ప‌టివ‌ర‌కు ఐదు సంక్రాంతి రిలీజెస్ చూశాడు. ఆ చిత్రాలే.. `నాగ‌`(2003), `ఆంధ్రావాలా` (2004), `నా అల్లుడు` (2005), అదుర్స్ (2010), `నాన్న‌కు ప్రేమ‌తో`(2016). వీటిలో చివ‌రి రెండు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించాయి. విశేష‌మేమిటంటే… ఈ రెండు మూవీస్ కూడా వేర్వేరు సంవ‌త్స‌రాల్లో ఒకే తేదిన(జ‌న‌వ‌రి 13) విడుద‌ల‌య్యాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

అంతేకాదు.. ఈ రెండు చిత్రాల‌కూ యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీ ప్ర‌సాద్ బాణీలు అందిస్తే… య‌న్టీఆర్ పాట‌లు పాడ‌డం విశేషం. `అదుర్స్`లో `వేర్ ఈజ్ ద‌ట్?` అంటూ `చారి` పాట‌ని పాడిన తార‌క్.. `నాన్న‌కు ప్రేమ‌తో`లో `ఫాలో ఫాలో` అంటూ స‌రికొత్త శైలిలో గానామృతం పంచాడు. కాగా, య‌న్టీఆర్ ద్విపాత్రాభిన‌యంలో వ‌చ్చిన `అదుర్స్`(వి.వి. వినాయ‌క్ ద‌ర్శ‌కుడు) నేటితో ప‌దేళ్ళు పూర్తిచేసుకుంటుండ‌గా.. క‌థానాయ‌కుడిగా తార‌క్ 25వ చిత్ర‌మైన `నాన్న‌కు ప్రేమ‌తో`(సుకుమార్ ద‌ర్శ‌కుడు) ఇవాళ్టితో నాలుగు వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంటోంది. మ‌రి.. భ‌విష్య‌త్ లో ఇదే తేదికి మ‌రో సినిమాతో ప‌ల‌క‌రించి.. య‌న్టీఆర్ `డేట్` హ్యాట్రిక్ అందుకుంటాడేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − one =