కథానాయకుడిగా తొలి అడుగేసిన సంవత్సరంలోనే ముచ్చటగా మూడు సినిమాలు చేసి మురిపించిన వైనం యంగ్ టైగర్ యన్టీఆర్ సొంతం. ఆపై ఏడాదికి కనీసం రెండు సినిమాలైనా రిలీజయ్యేలా ప్లాన్ చేసుకునేవాడు ఈ యాక్టింగ్ పవర్ హౌస్. అయితే, తొలిసారిగా 2009ని `జీరో రిలీజ్ ఇయర్`గా సరిపెట్టాడు తారక్. ఆ తరువాత మళ్ళీ గ్యాప్ తీసుకోని ఈ నందమూరి హ్యాండ్సమ్ హీరో.. కుదిరితే సంవత్సరానికి రెండు సినిమాలు లేదంటే కనీసం ఒక చిత్రమైనా చేస్తూ మురిపిస్తూ వచ్చాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే, దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న బడా మల్టీస్టారర్ `ఆర్ ఆర్ ఆర్` కోసం తలమునకలై ఉన్న తారక్… 2009 తరహాలోనే 2019ని కూడా మరో `జీరో రిలీజ్ ఇయర్`గా సరిపెట్టాల్సి వచ్చింది. అయితే, సదరు పేట్రియాటిక్ డ్రామా కాస్త అనూహ్యంగా 2021 సంక్రాంతికి వాయిదా పడడంతో 2020ని కూడా తన సినిమాలు లేని సంవత్సరంగా మిగులుస్తున్నాడు ఈ డాన్సింగ్ సెన్సేషన్.
[custom_ad]
చేస్తున్నది పక్కా బ్లాక్ బస్టర్ మూవీయే అయినా.. రెండేళ్ళ పాటు అభిమాన కథానాయకుడు నుంచి సినిమాలు రాకపోవడం ఎలాంటి అభిమానినైనా నిరుత్సాహపరిచే అంశమే. అందుకే… ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగే తారక్, చక్కగా ప్లాన్ చేసుకుని మరీ తక్కువ గ్యాప్ లోనే మరో చిత్రంతో పలకరించబోతున్నాడు. `ఆర్ ఆర్ ఆర్` షూటింగ్ పూర్తయిన వెంటనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాని మొదలుపెట్టి.. 2021 ఏప్రిల్ కి సదరు చిత్రంతో పలకరించబోతున్నాడు.
మరి.. మూడున్నర నెలల గ్యాప్ లో రెండు చిత్రాలతో పలకరిస్తూ… రెండేళ్ళ గ్యాప్ అనే బాకీని తీరుస్తున్న తారక్, ఆ యా స్టార్ డైరెక్టర్స్ మూవీస్ తో కెరీర్ బెస్ట్ హిట్స్ అందుకుంటాడేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























