`అసుర‌న్` ద‌ర్శ‌కుడితో య‌న్టీఆర్?

Jr NTR Teams Up With Asuran Movie Director,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Jr NTR,Asuran Movie Director,Asuran Movie,Jr NTR Latest News,Jr NTR New Movie News,Jr NTR Upcoming Film Updates,Jr NTR Latest Movie Details,Jr NTR Next Project News,Jr NTR Next Movie Details

యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్ ప్ర‌స్తుతం `డైరెక్ట‌ర్ నంబ‌ర్ వ‌న్` రాజ‌మౌళి రూపొందిస్తున్న `ఆర్ ఆర్ ఆర్`తో బిజీగా ఉన్నాడు. 2021 సంక్రాంతికి ఈ పేట్రియాటిక్ డ్రామా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. ఈలోపే సెల్యులాయిడ్ తాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్ మూవీని ప‌ట్టాలెక్కించ‌బోతున్నాడు య‌న్టీఆర్. `అయిన‌ను పోయి రావాలె హ‌స్తిన‌కు` పేరుతో ఈ సినిమా రూపొంద‌నుంద‌ని టాక్. అంతేకాదు.. మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ కి కూడా తార‌క్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని వినిపిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఆ వివ‌రాల్లోకి వెళితే… కోలీవుడ్ స్టార్ ధ‌నుష్ కాంబినేష‌న్ లో `ఆడుగ‌ల‌మ్`, `వ‌డ చెన్నై`తో పాటు రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ `అసుర‌న్`ని తెర‌కెక్కించిన వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలో య‌న్టీఆర్ ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. ఇప్ప‌టికే తార‌క్ కి వెట్రిమార‌న్ క‌థ‌ను వినిపించాడ‌ని, స్టోరీ న‌చ్చ‌డంతో స‌ద‌రు నంద‌మూరి స్టార్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని తెలిసింది. అలాగే.. తెలుగు, త‌మిళ భాష‌ల్లో బైలింగ్వ‌ల్ మూవీగా ఈ ఫిల్మ్ రూపొందుతుంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే య‌న్టీఆర్, వెట్రిమార‌న్ కాంబినేష‌న్ ఫిల్మ్ పై మ‌రింత క్లారిటీ వ‌స్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 4 =