
ట్యాగ్ · 58 కథనాలు · పేజీ 2


నేను వ్యాక్సిన్ వేయించుకున్నా.. మీరు కూడా..!

ప్రజలకు మహేష్ బాబు సందేశం

అమ్మకు ప్రేమతో .. మహేష్ బాబు

పవన్ కళ్యాణ్ క్షేమం కోరుతూ మహేష్ బాబు ట్వీట్

సితార "డబల్ ట్రబుల్ "

మహేష్ బాబు లేటెస్ట్ ఫొటో

మహేష్ తో సినిమా పక్కా.. కానీ..!
ప్రిన్స్ కు ఫిట్ నెస్ అవార్డ్
మరో చిన్నారికి తోడుగా మహేష్
దుబాయ్ లోస్మార్ట్ పోలీస్ స్టేషన్ - మహేష్ ఫిదా
ప్రస్తుతం వారి కోసమే ప్రార్ధనలు - మహేష్
మహేష్ బాబు లేటెస్ట్ వర్కౌట్
"ఒక్కడు" మూవీ సీక్వెల్ ?
మరో చిన్నారికి అండగా నిలిచిన మహేష్
మహేష్ సినీప్రస్థానానికి 41ఏళ్లు
'ఢిల్లీ క్రైమ్' టీం కి మహేష్ అభినందనలు

6 మిలియన్స్ క్లబ్ లోకి మహేష్

ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలి - మహేష్ బాబు
కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం తో సాధారణ ప్రజలతో పాటు సినీ సెలబ్రిటీస్ కూడా కరోనా మహమ్మారి బారిన పడుతున్న విషయం తెలిసిందే. అశేష అభిమాన గణం ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా నిర్ధారణ కావడంతో సినీ ప్రముఖులు , అభిమానులు ఆందోళనకు గురిఅయ్యారు. కరోనా కై ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒకరి నుండి మరొకరి కి కరోనా సోకుతుంది. తాను తన ఫ్యామిలీ సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నామనీ , అభిమానులు ఆందోళన చెందవద్దనీ ఎన్టీఆర్ కోరారు.

నేను వ్యాక్సిన్ వేయించుకున్నా.. మీరు కూడా..!
గత ఏడాది కంటే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ మరింద భయంకరంగా ఉంది. అప్పుడు మరణాల రేటు చాలా తక్కువగా ఉండేది.. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో మరణించేవారి సంఖ్య కూడా ఎక్కువైపోయింది. అయితే వ్యాక్సీన్ వేయించుకోవడంవల్ల వైరస్ ప్రభావం కాస్త తగ్గుతుంది. దీంతో సామాన్యులతో పాటు అందరూ వ్యాక్సీన్ లు వేయించుకోవడానికి రెడీ అవుతున్నారు. సెలబ్రిటీలు సైతం వ్యాక్సిన్ వేసుకుంటూ మీరందరు కూడా తప్పనిసరిగా టీకా వేసుకోవాలని సూచిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా వ్యాక్సీన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా కోవిడ్ 19 సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇది తీవ్రమైన ఇబ్బంది…

ప్రజలకు మహేష్ బాబు సందేశం
సూపర్ హిట్ "రాజకుమారుడు " మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన మహేష్ బాబు పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్నారు. ఫ్యాన్ ఫాలోయింగ్ అధికంగా ఉన్న మహేష్ బాబు ప్రస్తుతం యాక్షన్ ఎంటర్ టైనర్ "సర్కారు వారి పాట "మూవీ లో నటిస్తున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ మహేష్ బాబు మంచి విషయాలకు స్పందిస్తున్న విషయం తెలిసిందే.

అమ్మకు ప్రేమతో .. మహేష్ బాబు
వరస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బ్లాక్ బస్టర్ “గీతగోవిందం “మూవీ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “సర్కారు వారి పాట “మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ 2022 సంవత్సరం జనవరి లో రిలీజ్ కానుంది. “సర్కారు వారి పాట “మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ దుబాయ్ లో జరిగిన విషయం తెలిసిందే. “సర్కారు వారి పాట “మూవీ షూటింగ్ సెకండ్ షెడ్యూల్ ఉగాది రోజున ప్రారంభం అయ్యింది.

పవన్ కళ్యాణ్ క్షేమం కోరుతూ మహేష్ బాబు ట్వీట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన కోర్ట్ డ్రామా "వకీల్ సాబ్ "మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో దిగ్విజయం గా ప్రదర్శించబడడంతో అభిమానులు సంతోషంగా ఉండగా తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ కు కరోనా సోకడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు తమ హీరో త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు పవన్ క్షేమాన్ని కోరుతూ ట్వీట్స్ చేస్తున్నారు.

సితార "డబల్ ట్రబుల్ "
సూపర్ స్టార్ మహేష్ బాబు తనయ సితార సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోస్ , డ్యాన్స్ వీడియోస్ షేర్ చేసి ప్రేక్షక, అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. 8 సంవత్సరాల వయస్సు ఉన్న సితార కు స్వంతంగా యూట్యూబ్ ఛానల్ ఉండడం విశేషం. తన తాజా ఫొటో షూట్స్ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తున్న సితార తాజాగా ఆరెంజ్ ఫ్రాక్ తో ఉన్న తన ఫోటోలను షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

మహేష్ బాబు లేటెస్ట్ ఫొటో
బాలనటుడిగా టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించి మహేష్ బాబు , సూపర్ హిట్ "రాజకుమారుడు "మూవీ తో హీరోగా మారారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరిస్తూ మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. బ్లాక్ బస్టర్ " గీత గోవిందం "మూవీ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ "సర్కారు వారి పాట " మూవీ దుబాయ్ లో ఒక షూటింగ్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుని , తదుపరి షూటింగ్ షెడ్యూల్ కై సిద్ధమవుతుంది.

మహేష్ తో సినిమా పక్కా.. కానీ..!
'అర్జున్ రెడ్డి' సినిమాతో టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సెట్ చేశాడు డైరెక్టర్ సందీప్ వంగా. అప్పటి వరకూ ఒకే ధోరణిలో ఉన్న సినిమాలు చూసి విసిగిపోయిన ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరధం పట్టారు. ఈ సినిమాతో విజయ్ దేవరకొండకు వచ్చిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకోండి. కబీర్ సింగ్ సినిమాతో బాలీవుడ్ లో కూడా తన మార్క్ ను చూపించాడు. ఇక కబీర్ సింగ్ ఎఫెక్ట్ తో సందీప్ వంగా రేంజ్ కూడా మారిపోయిందని చెప్పొచ్చు. ఇప్పుడు సందీప్ తో సినిమా చేయడానికి బాలీవుడ్ హీరోలు కూడా రెడీగా ఉన్నారు.
ప్రిన్స్ కు ఫిట్ నెస్ అవార్డ్
టాలీవుడ్ లో రాకుమారుడు అంటే ఇంకెవరు మన సూపర్ స్టార్ మహేష్ బాబు అని అంటారు. టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ అందం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. వయసు పెరుగుతున్న కొద్ది ఆయన ఇంకా హ్యాండ్ సమ్ గా తయారవుతున్నారు. ఇప్పుడున్న మన యంగ్ హీరోలు కూడా మహేష్ ముందు పోటీ రాలేరు అని చెప్పొట్టు. హాలీవుడ్ హీరో లకు సైతం పోటీ ఇస్తాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి ఇలా ఉండటం అంటే అదేతో లక్కీగా వచ్చింది అనుకోవడం తప్పే. దానికోసం మహేష్ కూడా ఎంతో హార్ట్ వర్క్ చేస్తే కానీ ఇప్పుడు కూడా ఇలా యంగ్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఫిస్ నెస్ విషయంలో మహేష్ చాలా శ్రద్దగా ఉంటారు. తన ఇంట్లోనే స్పెషల్ గా తన కోసం జిమ్ కూడా ఏర్పాటు…
మరో చిన్నారికి తోడుగా మహేష్
సూపర్ స్టార్ మహేష్ బాబు చిన్నారులకు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పటికే వెయ్యికి పైగా గుండె ఆపరేషన్ లు చేయించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఇక ఇప్పుడు మరోచిన్నారికి తోడుగా నిలబడి సాయం అందించారు. మహేష్ కుటుంబం ప్రముఖ ఆంధ్రప్రదేశ్ యాజమాన్యంతో కలిసి చిన్నపిల్లలకు ఆపరేషన్ లు చేయిస్తున్నసంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే గుండె సంబంధిత వ్యాధితో ఆస్పత్రిలో చేరిన ఓ చిన్నారి అంకిత్ భార్గవ్‌కు మహేష్ ఆపరేషన్ చేయించారు. ప్రస్తుతం ఆ చిన్నారి కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. దీంతో అతడి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ మహేశ్ బాబుకు ధన్యవాదాలు తెలిపారు.
దుబాయ్ లోస్మార్ట్ పోలీస్ స్టేషన్ - మహేష్ ఫిదా
పరుశురాం దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'సర్కారు వారి పాట'. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం దుబాయ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. తొలి షెడ్యూల్ ఇప్పటికే పూర్తి కాగా, ప్రస్తుతం రెండో షెడ్యూల్ జరుగుతుంది. దుబాయ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక అక్కడి షూటింగ్ కు సంబంధించి పలు ఫొటోలు.. లొకేషన్స్ కు సంబందించిన ఫొటోలు ఇప్పటికే మహేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉన్నాడు.
వెడ్డింగ్ యానివర్సరీ.. మహేష్-నమ్రత ప్రేమకు 16యేళ్లు
ఒక్క సినిమాతోనే ప్రేమలో పడ్డారు.. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.. టాలీవుడ్ లోనే బెస్ట్ కపుల్స్ లిస్ట్ లో ముందు ఉంటారు..ఆ జంట ఎవరో ఇప్పటికే ఐడియా వచ్చి ఉంటది.. ఇంకెవరూ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్. 2000వ సంవత్సరంలో వచ్చిన వంశీ సినిమాలో మహేష్, నమ్రత కలిసి నటించారు. ఆ సినిమాతో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి 2005 లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహబంధానికి నేటితో 16 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఒకరికొకరు స్వీట్ గా విషెస్ చెప్పుకున్నారు.
ప్రస్తుతం వారి కోసమే ప్రార్ధనలు - మహేష్
సినిమాలు, ఫ్యామిలీ కేవలం వ్యక్తిగత విషయాలే కాదు అప్పుడప్పుడు సమాజంలో జరిగే విషయాలపై కూడా సూపర్ స్టార్ మహేష్ సోషల్ మీడియాలో స్పందిస్తుంటాడు. ఇక ఇప్పుడు తాజాగా ఉత్తరాఖండ్ విషాదంపై కూడా స్పందించి విచారం వ్యక్తం చేసాడు సూపర్ స్టార్ మహేష్. ఉత్తరాఖండ్‌లో సంభవించిన ధౌలిగంగా విషాదం అందరినీ కలిచివేస్తుంది. హిమాలయ మంచుకొండలు విరిగిపడటంతో ఒక్కసారిగా ఉప్పొంగిన దౌలీగంగా నదికి వరద ఒక్కసారిగా పోటెత్తడంతో ఈ ప్రవాహంతో 170 మంది కార్మికుల ఆచూకీ లభ్యం కాకుండా చేసింది. ఇప్పటి వరకూ 10 శవాలను వెలికి తీయగా.. అతికష్టం మీద 16 మంది రక్షించగలికారు సహాయ సిబ్బంది.
'సర్కారు వారి పాట' లొకేషన్స్ కు మహేష్ ఫిదా
పరుశురాం దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'సర్కారు వారి పాట'. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం దుబాయ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. దుబాయ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక అక్కడి షూటింగ్ కు సంబంధించి పలు ఫొటోలు.. లొకేషన్స్ కు సంబందించిన ఫొటోలు ఇప్పటికే మహేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండగా అవి వైరల్ అవుతున్నాయనుకోండి.
మహేష్ బాబు లేటెస్ట్ వర్కౌట్
వరస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. నలభై సంవత్సరాల వయస్సు దాటినప్పటికీ అందం , ఫిట్ నెస్ తో కుర్ర హీరోలకు పోటీగా ఉంటూ మహేష్ బాబు అమ్మాయిలతో పాటు అబ్బాయిలను కూడా ఆకట్టుకుంటున్నారు. మహేష్ బాబు అభిమానులలో మహిళా అభిమానులు కూడా అధిక శాతం లో ఉండడం విశేషం. కరోనా కారణంగా లాక్ డౌన్ లో 10 నెలలపాటు ఇంటికే పరిమితం అయిన మహేష్ బాబు కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ , ఫిట్ నెస్ కు ప్రాధాన్యత నిస్తున్న విషయం తెలిసిందే.
"ఒక్కడు" మూవీ సీక్వెల్ ?
సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు,భూమిక జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "ఒక్కడు "మూవీ ఘనవిజయం సాధించి మహేష్ బాబు సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 8 నందిఅవార్డ్స్ ,4 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్న"ఒక్కడు" మూవీ కన్నడ , తమిళ , బెంగాలీ , హిందీ భాషలలో రీమేక్ జరుపుకుని ఘనవిజయం సాధించింది. చార్మినార్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన "ఒక్కడు" మూవీ కై భారీ వ్యయం తో చార్మినార్ సెట్ ను రూపొందించడం విశేషం. మణిశర్మ సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మరో చిన్నారికి అండగా నిలిచిన మహేష్
సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే మహేష్ పలు గ్రామాల్ని దత్తత తీసుకొని వాటిని అభివృద్ది చేయడంలో కృషిచేస్తున్నాడు. అలాగే నిరు పేదలకి ఆయన అండగా ఉంటున్నాడు . ఇక చిన్న పిల్లలకు అయితే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వేయి చిన్న గుండెలకు మహేష్ ఆయువుపోశాడు. గత మూడేళ్ళ కాలంలో మహేష్ బాబు 1000 మంది చిన్నారులకు గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలని విజయవంతగా చేయించాడు. ఇది అందరికీ తెలిసిందే. ఇక ఇటీవలే తనుశ్రీ అనే పాపకు గుండె ఆపరేషన్ జరిగిందని నమ్రత తెలిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో చిన్నారికి అండగా నిలిచాడు మహేష్.
మహేష్ సినీప్రస్థానానికి 41ఏళ్లు
సూపర్ స్టార్ మహేష్ బాబు నట ప్రస్థానానికి 41ఏళ్లు అయ్యాయి. అదేంటీ ఇటీవలే కదా 21 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు కదా.. ఇప్పుడు 41 ఏళ్ళు అన్న డౌట్ వస్తుంది కదా. అసలు సంగతేంటంటే.. మహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే.. బాలనటుడిగా పలు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. 'నీడ' అనే చిత్రంతో బాల నటుడిగా 1979లో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు మహేష్ బాబు. ఇక ఈ సినిమా నేటితో 41 ఏళ్ళు పూర్తి చేసుకుంది.
'ఢిల్లీ క్రైమ్' టీం కి మహేష్ అభినందనలు
ఢీల్లీ లో జరిగిన నిర్భయ అత్యాచార ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటన అది. ఇక ఈ ఘటన ఆధారంగా..దర్శకుడు రిచీ మెహతా దర్శకత్వంలో 'ఢిల్లీ క్రైమ్' అనే టైటిల్ తో వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. ఈ సిరీస్ విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు అరుదైన ఘనత దక్కింది. 48వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుకు ఎంపికైంది. అంతరర్జాతీయ వేదిక వద్ద భారతీయ వెబ్ సిరీస్‌కు అరుదైన గౌరవం దక్కడంతో అందరూ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు.

6 మిలియన్స్ క్లబ్ లోకి మహేష్
సెలెబ్రటీస్ అందరూ సోషల్ మీడియాలో బాగానే యాక్టీవ్ గానే ఉంటారు. ఒకప్పుడు అంటే ఏదో కొంతమంది మాత్రమే సోషల్ మీడియాల్లో యాక్టీవ్ గా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో తమ అప్ డేట్స్ ఇస్తూ.. ఫ్యాన్స్ కు అందుబాటులో ఉంటూ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. ఇక టీజర్, ట్రైలర్స్ రికార్డ్స్ క్రియేట్ చేయడం కోసం హీరోస్ ఎంత ఎదురుచూస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను సంపాదించుకోవడం కూడా వారికి రికార్డ్స్ క్రియేట్ చేయడంతోనే సమానం. ఇక ఇప్పుడు అలాంటి ఒక రికార్డునే సొంతం చేసుకున్నాడు మహేష్.