6 మిలియన్స్ క్లబ్ లోకి మహేష్

Super Star Mahesh Babu Hits 6 Million Follower Mark On Instagram

సెలెబ్రటీస్ అందరూ సోషల్ మీడియాలో బాగానే యాక్టీవ్ గానే ఉంటారు. ఒకప్పుడు అంటే ఏదో కొంతమంది మాత్రమే సోషల్ మీడియాల్లో యాక్టీవ్ గా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో తమ అప్ డేట్స్ ఇస్తూ.. ఫ్యాన్స్ కు అందుబాటులో ఉంటూ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. ఇక టీజర్, ట్రైలర్స్ రికార్డ్స్ క్రియేట్ చేయడం కోసం హీరోస్ ఎంత ఎదురుచూస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను సంపాదించుకోవడం కూడా వారికి రికార్డ్స్ క్రియేట్ చేయడంతోనే సమానం. ఇక ఇప్పుడు అలాంటి ఒక రికార్డునే సొంతం చేసుకున్నాడు మహేష్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే ట్విట్టర్లో మహేష్ దాదాపు 11 మిలియన్ ఫాలోవర్స్ తో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ఏకంగా 60 లక్షల ఫాలోవర్స్ ను సంపాదించుకుని 6 మిలియన్ క్లబ్బులో చేరాడు. తను ఇన్ స్టాలోకి వచ్చి ఎంతో కాలం కానప్పటికీ, అత్యంత వేగంగా ఇంతమంది ఫాలోవర్లను సొంతం చేసుకోవడం విశేషమనే చెప్పాలి. దీంతో ఆయన అభిమానులు స్పెషల్ పోస్టులతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.

ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాకు రెడీ అవుతున్నాడు మహేష్. ఇటీవలే లాంఛనంగా ఈ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు. 2021 జనవరి నుండి ఈ సినిమాషూటింగ్ ను ప్రారంభించనున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 4 =