ఢీల్లీ లో జరిగిన నిర్భయ అత్యాచార ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటన అది. ఇక ఈ ఘటన ఆధారంగా..దర్శకుడు రిచీ మెహతా దర్శకత్వంలో ‘ఢిల్లీ క్రైమ్’ అనే టైటిల్ తో వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. ఈ సిరీస్ విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు అరుదైన ఘనత దక్కింది. 48వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుకు ఎంపికైంది. అంతరర్జాతీయ వేదిక వద్ద భారతీయ వెబ్ సిరీస్‌కు అరుదైన గౌరవం దక్కడంతో అందరూ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు.
ఇక సూపర్ స్టార్ మహేష్ కూడా దీనిపై స్పందిస్తూ తన సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు. ఢిల్లీ క్రైమ్ నిజంగా మాస్టర్ స్ట్రోక్.. ఎమ్మీ అవార్డు దక్కినందుకు ఢిల్లీ క్రైమ్ టీం కి అభినందనలు తెలిపారు.
#DelhiCrime is a masterstroke!Congratulations to the entire team on its terrific win at the #Emmys. Truly deserving! 👏👏👏
— Mahesh Babu (@urstrulyMahesh) November 25, 2020
కాగా ఈ సిరీస్‌లో నటుడు షెపాలి షా మాజీ ఢిల్లీ పోలీస్ డిసిపి చాయా శర్మ పాత్రను పోషించారు. దారుణమైన ఈహత్యాచార ఘటనను ఆయన 72 గంటల్లో చేధించారు. 2019లో విడుదలైన ఈ ఘటనను సున్నితంగా చెప్పిన తీరుకు ప్రశంసలు అందుకుంది. షా, రాసికా దుగల్, అదిల్ హుస్సేన్ , రాజేష్ టైలాంగ్‌లు తమ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.




Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.