
ట్యాగ్ · 106 కథనాలు · పేజీ 2


అనుష్క కొత్త సినిమా.. ఏకంగా 14 భాషల్లో

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్రైలర్ రిలీజ్

మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి రిలీజ్ డేట్ ఫిక్స్

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి టీజర్ అప్ డేట్

చంద్రముఖి 2 మూవీ షూటింగ్ అప్ డేట్

స్టార్ హీరోయిన్ త్రిష ఫేవరెట్ హీరోయిన్

యూవీ క్రియేషన్స్ మూవీ- నవీన్ పాత్ర రివీల్

స్టార్ డైరెక్టర్ నిర్మాతగా హార్రర్ సినిమా?

భూత కోలా వేడుకల్లో స్వీటీ అనుష్క

#Anushka48 మూవీ సెట్స్ లో జాయిన్ అయిన అనుష్క

ఈ సినిమాకు తొలి ప్రేక్షకుడ్ని నేనే - మెగాస్టార్ చిరంజీవి
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కాంబినేషన్‌లో రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. కాగా యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై మహేష్ బాబు.పి దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఈ నెల 7వ తేదీన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి నుంచి ప్రశంసలు లభించాయి. ఈ సినిమా ఆద్యంతం తనను ఆకట్టుకుందని, ఈ హిలేరియస్ ఎంటర్ టైనర్‌ను ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారని చిరంజీవి అన్నారు.

అనుష్క కొత్త సినిమా.. ఏకంగా 14 భాషల్లో
స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి త్వరలోనే ఒక కొత్త చిత్రాన్ని ప్రారంభించనున్నారు. అయితే ఇది ఏకంగా 14 భాషల్లో రిలీజ్ కానుండటం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. 'కథానార్ - ది వైల్డ్ సోర్సెరర్' అనే పేరుతో రూపొందనున్న ఈ సినిమా ప్రధానంగా హారర్ నేపథ్యంలో ఉండొచ్చని తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి గ్లింప్స్ రిలీజ్ చేశారు. కాగా ఇది మలయాళ సినిమా కావడం గమనార్హం. మరో విశేషం ఏంటంటే..? మలయాళంలో అనుష్కకు ఇదే తొలి సినిమా. 18 ఏళ్ల తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఆమె ఇప్పటివరకు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటించారు. ఇప్పుడు మొదటిసారిగా మాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది.

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్రైలర్ రిలీజ్
నవీన్ పోలిశెట్టి,అనుష్క జంటగా నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. అనౌన్స్ అయినప్పడినుండే ఈసినిమా హైప్ తెచ్చుకోగా రీసెంట్ గా రిలీజైన సాంగ్స్ ,టీజర్ తో ఆ హైప్ మరింత పెరిగింది. ఇక ఇప్పుడు తాజాగా ట్రైలర్ కూడా విడుదలైయింది.ఇక ఈ హిలేరియస్ ట్రైలర్ తో సినిమా పక్కా హిట్ అనేలా వుంది.

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
జాతిరత్నాలుతో ఫేమ్ తెచ్చుకున్నాడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. ఈసినిమా తరువాత నవీన్ నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.ఇందులో అనుష్క హీరోయిన్.రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.ఇక విడుదలకు రోజులు దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ ఫై ద్రుష్టి పెట్టింది చిత్ర బృందం.అందులో భాగంగా ఈసినిమా ట్రైలర్ ను ఈనెల 21న విడుదల చేయనున్నారు.

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రిలీజ్ డేట్ వచ్చేసింది
జాతిరత్నాలు వచ్చి రెండేళ్లు అయినా మరో సినిమా తో ప్రేక్షకులను పలకరించలేదు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. ఈసినిమా తరువాత నవీన్ నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఇందులో అనుష్క హీరోయిన్ కావడంతో సినిమాకు మొదటి నుండే హైప్ వచ్చింది.ఇక ఇటీవల విడుదలచేసిన టీజర్ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.అయితే ఈనెల 4న ఈసినిమా థియేటర్లలోకి రావాల్సింది కానీ పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కావడం వల్ల వాయిదా వేశారు ఇక తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు.సెప్టెంబర్ 7న ఈసినిమా విడుదలకానుంది.అంటే సరిగ్గా విజయ్ దేవరకొండ నటించిన ఖుషి వచ్చిన వారానికి ఈసినిమా వస్తుంది.దాంతో ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఉండనుంది.

టాలెంటెడ్ హీరోయిన్ అనుష్క 18 సక్సెస్ ఫుల్ ఇయర్స్ జర్నీ
ఇండస్ట్రీలో ఇప్పుడు హీరోయిన్ల లైఫ్ టైమ్ ఎంత తక్కువుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు రెండు మూడు డెకెడ్లు రాణించేవారు. క్రమక్రమంగా తగ్గుకుంటూ వస్తుంది. ఇప్పుడైతే స్టార్ డమ్ వచ్చిన తర్వాత గట్టిగా ఐదారేళ్లు ఫుల్ బిజీగా ఉన్నా ఆతరువాత కొత్త హీరోయిన్లు రావడం వీరికి అవకాశాలు తగ్గడం జరుగుతున్నాయి. అయితే కొంతమంది హీరోయిన్లకు మాత్రం ఇది మినహాయింపే అని చెప్పొచ్చు. వారు సినిమాలు చేయడానికి ముందుకు రావాలే కానీ ఇంకా చేయడానికి దర్శకనిర్మాతలు రెడీగా ఉన్నారు. అలాంటి హీరోయిన్లలో మొదటగా అనుష్క శెట్టి గురించి చెప్పుకోవచ్చు.

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి- లేడి లక్ వీడియో సాంగ్ రిలీజ్
మహేష్ బాబు.పి దర్శకత్వంలో అనుష్క హీరోయిన్ గా వస్తున్న సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఇక ఈసినిమాలో తన సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపుతెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి కూడా నటిస్తున్నాడు. ఈసినిమాలో అనుష్క చెఫ్ గా అలానే నవీన్ స్టాండప్ కమెడియన్ గా కనిపించనున్నారు. ఒక చెఫ్‌కు, స్టాండప్ కమెడియన్‌కు మధ్య సాగే ప్రేమకథ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈసినిమాను ఆగష్ట్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ లో అరుంధతి, భాగమతి, దేవసేన పేర్లకు పెట్టింది పేరు అనుష్క. ఎన్నో ఏళ్లు స్టార్ హీరోయిన్ గా రాణించిన అనుష్క ఈమధ్య సినిమాలకు చాలా గ్యాప్ తీసుకుంటుంది. అనుష్క నుంటి వచ్చిన చివరి సినిమా నిశ్శబ్దం. ఈసినిమా వచ్చి మూడేళ్లు అయిపోయింది. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత మరో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తుంది. మహేష్ బాబు.పి దర్శకత్వంలో అనుష్క హీరోయిన్ గా వస్తున్న సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఇక ఈసినిమాలో తన సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపుతెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి కూడా నటిస్తున్నాడు. ఇక క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటి నుండీ ఈసినిమాపై భారీ…

మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి నుండి హతవిధీ సాంగ్ రిలీజ్
ప్రస్తుతం రిలీజ్ కాబోతున్న క్రేజీ కాంబినేషన్స్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క, యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టిది. మహేష్ బాబు.పి దర్శకత్వంలో వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్నసినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఈసినిమాాపై ముందు నుండీ మంచి అంచనాలు ఉన్నాయి. ఈసినిమాలో నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ గా నటిస్తుండగా అనుష్క చెఫ్ పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈనేపథ్యంలో ఈసినిమా నుండి వరుసగా అప్ డేట్లు ఇస్తూ వస్తున్నారు. రీసెంట్ గానే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి టీజర్ పై చరణ్ ప్రశంసలు
చాలా గ్యాప్ తరువాత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క నుండి వస్తున్న సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఈసినిమాలో నవీన్ పోలిశెట్టి కూడా నటిస్తున్నాడు. ఈసినిమాలో నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ గా నటిస్తుండగా అనుష్క చెఫ్ పాత్రలో కనిపించనుంది. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై ఈసినిమా మంచి ఎక్సెపెక్టేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు చిత్రయూనిట్ కూడా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది.

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి టీజర్ పై స్పందించిన ప్రభాస్
జాతిరత్నాలతో ఫేమ్ తెచ్చుకున్నాడు యువ హీరో నవీన్ పోలిశెట్టి.ఈసినిమా తనకి బ్రేక్ ఇచ్చింది. జాతి రత్నాలు వచ్చి రెండేళ్లు అవుతున్నా ఇంతవరకు నవీన్ నుండి మరో సినిమా థియేటర్లలోకి రాలేదు.కథ నచ్చితే కానీ సినిమాలకు కమిట్ అవ్వడం లేదు ఈ యువ హీరో.ప్రస్తుతం అతని చేతిలో రెండు సినిమాలు వున్నాయి.ఇక ఆరెండు సినిమాల్లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఒకటి.

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి టీజర్ అప్ డేట్
స్టార్ హీరోయిన్ అనుష్క, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఇప్పటివరకూ ఈసినిమా నుండి అనుష్క, నవీన్ పోలీశెట్టి కి సంబంధించిన ఫస్ట్ లుక్స్ పోస్టర్ల తో పాటు పలు స్పెషల్ పోస్టర్లు రిలీజ్ చేస్తూ వచ్చారు. అంతేకాదు మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. ఇక తాజాగా ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా తెలిపారు. రేపు అంటే ఏప్రిల్ 29వ తేదీన…

రిలీజ్ అయిన అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ ఫస్ట్ సింగిల్
యువి క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్ బాబు దర్శకత్వంలో అనుష్క, నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలలో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో ఈ సినిమా ఏకకాలంలో సమ్మర్ కు రిలీజ్ కానుంది. మహిళా దినోత్సవ సందర్భంగా ఈ సినిమా యూనిట్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ అనుష్క పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్లో అనుష్క శెట్టి హ్యాండ్ బ్యాగ్ తో విదేశాల్లో నడుస్తూ వెళుతున్నట్లుగా కనిపిస్తోంది. కొంత గ్యాప్ తరువాత అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ ఉమెన్స్ డే స్పెషల్ పోస్టర్
సూపర్ మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన అనుష్క తెలుగు, తమిళ భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కు పెట్టింది పేరుగా మారిన అనుష్క బాహుబలి, వేదం, రుద్రమ దేవి, భాగమతి వంటి సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నిశ్శబ్దం మూవీ తరువాత కొంత గ్యాప్ తీసుకున్న అనుష్క ఒక మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

చంద్రముఖి 2 మూవీ షూటింగ్ అప్ డేట్
శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి. వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార, జ్యోతిక, ప్రభు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన కామెడీ హారర్ చంద్రముఖి తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. చంద్రముఖి పాత్రలో జ్యోతిక అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి. వాసు దర్శకత్వంలో లారెన్స్ హీరోగా చంద్రముఖి సీక్వెల్ చంద్రముఖి 2 మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ చంద్రముఖి పాత్రలో నటిస్తున్నారు. లెజెండరీ కమెడియన్ వడివేలు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీలో రాధికా శరత్ కుమార్, లక్ష్మీ…

స్టార్ హీరోయిన్ త్రిష ఫేవరెట్ హీరోయిన్
తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ త్రిష స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా మణిరత్నం పొన్నియన్ సెల్వన్ 1 సూపర్ సక్సెస్ అవ్వడంతో త్రిష క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం త్రిష తమిళంలో మూడు, మలయాళంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. దళపతి విజయ్ తో ఒక మూవీ తో పాటు మరికొన్ని ఆఫర్లు కూడా త్రిష అందుకొన్నట్టు సమాచారం. తాజాగా త్రిష సినిమాలతో పాటు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ బృందా వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లోత్రిష పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలోనటించారు.

యూవీ క్రియేషన్స్ మూవీ- నవీన్ పాత్ర రివీల్
మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి.. ఆ తరువాత హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుసగా హిట్లు అందుకొని ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ యంగ్ హీరోల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న హీరో నవీన్ పోలిశెట్టి. ఏజెంట్ సాయి శ్రీనివాస్ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి హిట్ కొట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నవీన్ పోలిశెట్టి. ఆ తర్వాత వచ్చిన జాతిరత్నాలు సినిమాతోనూ మరో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు వరుసగా పెద్ద పెద్ద బ్యానర్లలో సినిమాలు చేసే అవకాశాలు వస్తున్నాయి నవీన్ పోలిశెట్టికి.

స్టార్ డైరెక్టర్ నిర్మాతగా హార్రర్ సినిమా?
ప్రస్తుతం హార్రర్ సినిమాల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. ఆడియన్స్ అందరూ ఈ జోనర్ కు ఎప్పుడూ కనెక్ట్ అవుతారు కాబట్టి మేకర్స్ కూడా ఈ జోనర్ లో సినిమాలు తీయడానికి ఇష్టపడుతుంటారు. ఇక ఇప్పుడు మరో క్రేజీ కాంబినేషన్ తెరపైకి రానున్నట్టు తెలుస్తుంది. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ నిర్మాతగా మారి ఓ హార్రర్ సినిమాను తెరకెక్కించనున్నట్టు సమాచారం. హీరో పృథ్విరాజ్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకోవడంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు కాదు ఈహార్రర్ సినిమాలో లీడ్ రోల్ లో క్రేజీ కాంబనేషన్ ను తీసుకురానున్నారట. ఆ జంట ఎవరో కాదు.. హార్రర్ సినిమాలు తీయడంలో ఎక్పర్ట్ అయిన రాఘవ లారెన్స్ ఇంకా లేడీ…

భూత కోలా వేడుకల్లో స్వీటీ అనుష్క
టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ అనుష్క స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. కమర్షియల్ మూవీస్ తో పాటు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో అనుష్క ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. నిశ్శబ్దం మూవీ తరువాత కొంత గ్యాప్ తీసుకుని అనుష్క తాజాగా యు వి క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న #ANUSHKA 48 మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ లో అనుష్కషెఫ్ పాత్రలో నటిస్తున్నారు. బర్త్ డే సందర్భంగా అన్విత రవళి శెట్టి పాత్రలో నటిస్తున్న అనుష్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

#Anushka48 మూవీ సెట్స్ లో జాయిన్ అయిన అనుష్క
టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ అనుష్క స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. కమర్షియల్ మూవీస్ తో పాటు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో అనుష్క ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. నిశ్శబ్దం మూవీ తరువాత కొంత గ్యాప్ తీసుకుని అనుష్క తాజాగా ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.