టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ అనుష్క స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. కమర్షియల్ మూవీస్ తో పాటు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో అనుష్క ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. నిశ్శబ్దం మూవీ తరువాత కొంత గ్యాప్ తీసుకుని అనుష్క తాజాగా ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యు వి క్రియేషన్స్ బ్యానర్ పై అనుష్క కథానాయికగా తెరకెక్కిన మిర్చి , భాగమతి మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఇప్పుడు ఆ బ్యానర్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ లో అనుష్క నటిస్తున్నారు. యు వి క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్ బాబు దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క, సక్సెస్ ఫుల్ చిత్ర హీరో నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో ఒక మూవీ తెరకెక్కుతుంది.అనుష్క48వ మూవీ గా తెరకెక్కుతున్న ఈ మూవీ లో అనుష్కషెఫ్ పాత్రలో నటిస్తున్నారు. బర్త్ డే సందర్భంగా అన్విత రవళి శెట్టి పాత్రలో నటిస్తున్న అనుష్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయాగ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ మూవీ తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ… నాలుగు దక్షిణాది భాషల్లో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. తాజాగా #Anushka48 మూవీ సెట్స్ లో అనుష్క జాయిన్ అయ్యారు. ఆ విషయాన్నీ అనుష్క స్వయంగా వెల్లడించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: