టాలెంటెడ్ హీరోయిన్ అనుష్క 18 సక్సెస్ ఫుల్ ఇయర్స్ జర్నీ

anushka shetty 18 years successful journey in telugu film industry

ఇండస్ట్రీలో ఇప్పుడు హీరోయిన్ల లైఫ్ టైమ్ ఎంత తక్కువుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు రెండు మూడు డెకెడ్లు రాణించేవారు. క్రమక్రమంగా తగ్గుకుంటూ వస్తుంది. ఇప్పుడైతే స్టార్ డమ్ వచ్చిన తర్వాత గట్టిగా ఐదారేళ్లు ఫుల్ బిజీగా ఉన్నా ఆతరువాత కొత్త హీరోయిన్లు రావడం వీరికి అవకాశాలు తగ్గడం జరుగుతున్నాయి. అయితే కొంతమంది హీరోయిన్లకు మాత్రం ఇది మినహాయింపే అని చెప్పొచ్చు. వారు సినిమాలు చేయడానికి ముందుకు రావాలే కానీ ఇంకా చేయడానికి దర్శకనిర్మాతలు రెడీగా ఉన్నారు. అలాంటి హీరోయిన్లలో మొదటగా అనుష్క శెట్టి గురించి చెప్పుకోవచ్చు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అనుష్క. ఇక ఆసినిమా తరువాత అనుష్క ఇప్పటివరకూ అవకాశాల కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఇక ప్రతి హీరో, హీరోయిన్ కు సినిమా ఫ్లాప్ అవ్వడం అనేది కామనే. అలా అనుష్క ఇన్నేేళ్ల సినీ కెరీర్ లో కూడా పలు ఫ్లాప్స్ ను అందుకుంది. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. అంతేకాదు హీరోలతో పాటు ధీటుగా కేవలం అనుష్క కటౌట్ ను పెట్టి తన కోసం స్టోరీ లు రాసి సినిమా తీసే అంత స్థాయికి ఎదిగింది.అలా తన నుండి అరుంధతి, దేవసేన, రుద్రమదేవి, భాగమతి లాంటి అద్భతమైన పాత్రలు వచ్చాయి.

ఇక ఇప్పుడు సినీ కెరీర్ లో 18 సక్సెస్ ఫుల్ ఇయర్స్ ను కంప్లీట్ చేసుకుంది అనుష్క. ఇన్నేళ్ల కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఎంతోమంది స్టార్ హీరోల సరసన చేసింది. ఇక ఈమధ్య కాలంలో పెద్దగా సినిమాలు తీసింది లేదు అనుష్క. నిశ్శబ్దం సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకొని ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు అలరించడానికి వచ్చేస్తుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ కూడా సోషల్ మీడియా ద్వారా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ అభినందనలు తెలియచేస్తూ మరిన్ని సినిమాలు చేయాలని కోరారు. మరి అనుష్క కూడా గతంలో లానే డిఫరెంట్ సినిమాలతో అలానే కంటిన్యూగా సినిమాలు చేస్తూ సినీ ప్రేక్షకులను అలరించాలని కోరుకుందాం..

 

View this post on Instagram

 

A post shared by UV Creations (@uvcreationsofficial)

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 1 =