జాతిరత్నాలు వచ్చి రెండేళ్లు అయినా మరో సినిమా తో ప్రేక్షకులను పలకరించలేదు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. ఈసినిమా తరువాత నవీన్ నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఇందులో అనుష్క హీరోయిన్ కావడంతో సినిమాకు మొదటి నుండే హైప్ వచ్చింది.ఇక ఇటీవల విడుదలచేసిన టీజర్ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.అయితే ఈనెల 4న ఈసినిమా థియేటర్లలోకి రావాల్సింది కానీ పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కావడం వల్ల వాయిదా వేశారు ఇక తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు.సెప్టెంబర్ 7న ఈసినిమా విడుదలకానుంది.అంటే సరిగ్గా విజయ్ దేవరకొండ నటించిన ఖుషి వచ్చిన వారానికి ఈసినిమా వస్తుంది.దాంతో ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఉండనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మహేష్ బాబు పి తెరకెక్కిస్తున్న ఈసినిమాలో నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ గా నటించగా అనుష్క చెఫ్ పాత్రలో కనిపించనుంది. అర్జున్ రెడ్డి ఫేమ్ రధాన్ సంగీతం అందిస్తున్నాడు.యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది.మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి పాన్ ఇండియా మూవీగా విడుదలకానుంది.
ఇక ఈసినిమా తరువాత అనుష్క ఇంతవరకు ఆమె మరో సినిమాకు సైన్ చేయలేదు.నవీన్ మాత్రంప్రస్తుతం అనగనగా ఒక రాజు అనే సినిమాలో నటిస్తున్నాడు.కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నఈసినిమా ను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























