రిలీజ్ అయిన అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ ఫస్ట్ సింగిల్

Miss Shetty Mr Polishetty Movie First Single Out Now

యువి క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్ బాబు దర్శకత్వంలో అనుష్క, నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలలో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో ఈ సినిమా ఏకకాలంలో సమ్మర్ కు రిలీజ్ కానుంది. మహిళా దినోత్సవ సందర్భంగా ఈ సినిమా యూనిట్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ అనుష్క పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్లో అనుష్క శెట్టి హ్యాండ్ బ్యాగ్ తో విదేశాల్లో నడుస్తూ వెళుతున్నట్లుగా కనిపిస్తోంది. కొంత గ్యాప్ తరువాత అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్ర యూనిట్ మొదటి నుంచీ వెరైటీగా ప్రమోషన్లు చేస్తోంది. అసలు ఈ సినిమా టైటిల్ నే చాలా డిఫరెంట్ గా అనౌన్స్ చేసింది. అనుష్క శెట్టిలోని శెట్టిని, నవీన్ పోలిశెట్టిలోని పోలిశెట్టిని తీసుకునే టైటిల్ ఫిక్స్ చేయడం విశేషం. ఈ సినిమాలో అనుష్క మాస్టర్ చెఫ్ గా చేస్తుండగా.. నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ గా నటిస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ నో నో నో ను రిలీజ్ చేసింది.రాధన్‌స్వరకల్పనలో అనంత శ్రీరామ్ రచన , ఎమ్ ఎమ్ మానసి ఆలపించిన ఈ సాంగ్ డిఫరెంట్ ట్యూన్ తో అలరిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − thirteen =