యూవీ క్రియేషన్స్ మూవీ- నవీన్ పాత్ర రివీల్

Naveen Polishetty Role Revealed From UV Creations Movie,Naveen Polishetty’s Birthday Poster From Anushka Shetty’s Film Is Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Naveen Polishetty,Naveen Polishetty Latest News,Naveen Polishetty Live Updates,Naveen Polishetty News,Naveen Polishetty Birthday Poster,Anushka Shetty,Anushka Shetty New Film,Anushka Shetty Upcoming Movie

మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి.. ఆ తరువాత హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుసగా హిట్లు అందుకొని ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ యంగ్ హీరోల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న హీరో నవీన్ పోలిశెట్టి. ఏజెంట్ సాయి శ్రీనివాస్ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి హిట్ కొట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నవీన్ పోలిశెట్టి. ఆ తర్వాత వచ్చిన జాతిరత్నాలు సినిమాతోనూ మరో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు వరుసగా పెద్ద పెద్ద బ్యానర్లలో సినిమాలు చేసే అవకాశాలు వస్తున్నాయి నవీన్ పోలిశెట్టికి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నవీన్ పోలీశెట్టి లిస్ట్ లో పలు సినిమాలు ఉండగా వాటిలో యూవీ క్రియేషన్స్ లో వస్తున్న సినిమా కూడా ఒకటి. ప్రస్తుతం సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కూడా నటిస్తుంది. దీంతో క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈసినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక రీసెంట్ గానే అనుష్క పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా నుండి అనుష్క శెట్టి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో ఆమె ప్రొఫెషనల్ చెఫ్ అన్వితా రవళి శెట్టి పాత్రలో కనిపించనుంది. ఇక తాజాగా ఈసినిమాలోని నవీన్ పాత్రకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. నేడు నవీన్ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా నుండి నవీన్ పాత్రను రివీల్ చేశారు. ఈసినిమాలో నవీన్ సిద్దూ పోలిశెట్టి పాత్రలో నటిస్తున్నట్టు ప్రకటించారు.

కాగా మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కి నిరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తుండగా రధన్ మ్యూజిక్ ఇస్తున్నారు. ఈసినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 11 =