సూపర్ మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన అనుష్క తెలుగు, తమిళ భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కు పెట్టింది పేరుగా మారిన అనుష్క బాహుబలి, వేదం, రుద్రమ దేవి, భాగమతి వంటి సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నిశ్శబ్దం మూవీ తరువాత కొంత గ్యాప్ తీసుకున్న అనుష్క ఒక మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
యువి క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్ బాబు దర్శకత్వంలో అనుష్క, నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలలో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో ఈ సినిమా ఏకకాలంలో సమ్మర్ కు రిలీజ్ కానుంది. మహిళా దినోత్సవ సందర్భంగా ఈ సినిమా యూనిట్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ అనుష్క పోస్టర్ తో ఉన్న ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్లో అనుష్క శెట్టి హ్యాండ్ బ్యాగ్ తో విదేశాల్లో నడుస్తూ వెళుతున్నట్లుగా కనిపిస్తోంది. కొంత గ్యాప్ తరువాత అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: