జాతిరత్నాలతో ఫేమ్ తెచ్చుకున్నాడు యువ హీరో నవీన్ పోలిశెట్టి.ఈసినిమా తనకి బ్రేక్ ఇచ్చింది. జాతి రత్నాలు వచ్చి రెండేళ్లు అవుతున్నా ఇంతవరకు నవీన్ నుండి మరో సినిమా థియేటర్లలోకి రాలేదు.కథ నచ్చితే కానీ సినిమాలకు కమిట్ అవ్వడం లేదు ఈ యువ హీరో.ప్రస్తుతం అతని చేతిలో రెండు సినిమాలు వున్నాయి.ఇక ఆరెండు సినిమాల్లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఒకటి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ హీరోయిన్ అనుష్క ఇందులో కథానాయకి కావడం అలాగే యూవీ క్రియేషన్స్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈసినిమా పై భారీ అంచనాలు వున్నాయి.ఇందులో నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ గా నటిస్తుండగా అనుష్క చెఫ్ పాత్రలో కనిపించనుంది.శనివారం ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఫన్ రైడ్ గా వచ్చిన ఈ టీజర్ చూస్తే.. టైటిల్ రోల్స్ లో నవీన్ పోలిశెట్టి,అనుష్క ఎంటర్టైన్ చేయనున్నారని అర్ధమవుతుంది.ఇక ఈ టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటివరకు యూట్యూబ్ లో 3మిలియన్ పైగా వ్యూస్ ను రాబట్టి ట్రెండింగ్ లో కొనసాగుతుంది.
ఇక ఈ టీజర్ పై రెబల్ స్టార్ ప్రభాస్ ఇంస్టాగ్రామ్ ద్వారా తన స్పందనను తెలియజేశాడు.టీజర్ చాలా ఎంటర్టైనర్ గా ఉందని సినిమా యూనిట్ కి ఆల్ ది బెస్ట్ అని ప్రభాస్ ఇంస్టా స్టేటస్ లో పోస్ట్ చేశాడు. మహేష్ బాబు పి డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాకు రధాన్ సంగీతం అందిస్తున్నాడు.పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్నఈసినిమా ఈఏడాది సెకండ్ హాఫ్ లో విడుదలకానుంది.
ఇక నిశ్శబ్దం తరువాత ప్రస్తుతం ఈ ఒక్క సినిమా లోనే నటిస్తుంది అనుష్క.ఇంతవరకు ఆమె మరో ప్రాజెక్టు కు సైన్ చేయలేదు.నవీన్ మాత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తోపాటు అనగనగా ఒక రాజు అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు.కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నఈసినిమా ను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: