ప్రస్తుతం హార్రర్ సినిమాల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. ఆడియన్స్ అందరూ ఈ జోనర్ కు ఎప్పుడూ కనెక్ట్ అవుతారు కాబట్టి మేకర్స్ కూడా ఈ జోనర్ లో సినిమాలు తీయడానికి ఇష్టపడుతుంటారు. ఇక ఇప్పుడు మరో క్రేజీ కాంబినేషన్ తెరపైకి రానున్నట్టు తెలుస్తుంది. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ నిర్మాతగా మారి ఓ హార్రర్ సినిమాను తెరకెక్కించనున్నట్టు సమాచారం. హీరో పృథ్విరాజ్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకోవడంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు కాదు ఈహార్రర్ సినిమాలో లీడ్ రోల్ లో క్రేజీ కాంబనేషన్ ను తీసుకురానున్నారట. ఆ జంట ఎవరో కాదు.. హార్రర్ సినిమాలు తీయడంలో ఎక్పర్ట్ అయిన రాఘవ లారెన్స్ ఇంకా లేడీ సూపర్ స్టార్ నయనతార. ఈసినిమాకు గులు గులు ఫేమ్ రత్న కుార్ దర్శకత్వం వహించనున్నాడట. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం అధికారికంగా ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తమిళ్ లో ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్న డైరెక్టర్లలో లోకేష్ కనగరాజ్ ఒకరు. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసుకుంటూ వరుసగా హిట్లు అందుకుంటూ దూసుకుపోతున్నాడు లోకేష్ కనగరాజ్. ఇక రీసెంట్ గానే లోకేష్ కనగరాజ్ విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. కమల్ కు మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను అందించడమే కాకుండా తమిళ్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. తన తరువాత సినిమా విజయ్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఇక లారెన్స్ ఇప్పటికే చంద్రముఖి 2 సినిమా చేస్తున్నాడు. మరోవైపు నయనతార కూడా కనెక్ట్ అంటూ హార్రర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమా పాజిటివ్ టాక్ నే సొంతం చేసుకుంది. మరి వీరి ముగ్గురు కాంబినేషన్ ఎప్పుడు లైన్ లోకి వస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























