టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ అనుష్క స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. కమర్షియల్ మూవీస్ తో పాటు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో అనుష్క ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. నిశ్శబ్దం మూవీ తరువాత కొంత గ్యాప్ తీసుకుని అనుష్క తాజాగా యు వి క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న #ANUSHKA 48 మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ లో అనుష్కషెఫ్ పాత్రలో నటిస్తున్నారు. బర్త్ డే సందర్భంగా అన్విత రవళి శెట్టి పాత్రలో నటిస్తున్న అనుష్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హిందూ ధర్మంలో భాగంగా భూతకోలా ఒక ప్రత్యేక దైవారాధనగా ఉంది. కర్ణాటకలోకి దక్షిణ కోస్తా ప్రాంతానికి చెందిన మంగళూరు, ఉడిపి, కుందాపుర లాంటి ప్రాంతాల్లో ఈ ఆరాధన కనిపిస్తుంది. కేరళలోని ఉత్తర మలబార్ ప్రాంతంలోనూ ఇది ప్రాచుర్యంలో ఉంది. వరాహం ఆత్మను పూజిస్తూ జరుపుకొనే పండుగ ఇది.స్టార్ హీరోయిన్ అనుష్క స్వస్థలం మంగుళూరు. అక్కడ భూతకోలా వేడుకలు ఫేమస్. తాజాగా అనుష్క ఆ వేడుకలకు హాజరు అయ్యారు. భూతకోలా నృత్యాలని అనుష్క భక్తి శ్రద్దలతో వీక్షించారు . తన స్వస్థలంలో జరుగుతున్న సాంప్రదాయంపై అనుష్క ఎంతో భక్తి, గౌరవం ప్రదర్శించడం విశేషం. భూత కోలా వేడుకను దర్శకుడు రిషబ్ శెట్టి కాంతార మూవీ లో అద్భుతంగా తెరకెక్కించిన విషయం తెలిసిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: