
ట్యాగ్ · 19 కథనాలు


క్వీన్ అనుష్క శెట్టి 'ఘాటి' రిలీజ్ డేట్ ఫిక్స్

అనుష్క కొత్త సినిమా.. ఏకంగా 14 భాషల్లో

మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి రిలీజ్ డేట్ ఫిక్స్

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి టీజర్ అప్ డేట్

"అరుంధతి"లో జేజమ్మ పాత్ర పై అనుష్క స్పందన

13 వసంతాల "అరుంధతి "

అఫీషియల్.. యూవీ క్రియేషన్స్ లో నవీన్

ప్రభాస్ కు అనుష్క బర్త్ డే విషెస్

అక్టోబర్ లో సెట్స్ పైకి 'చంద్రముఖి2'

14 వసంతాల "లక్ష్యం "

దేశీయ యాప్ "కూ " లో అనుష్క

"లూసిఫర్ "తెలుగు రీమేక్ లో అనుష్క ?

అనుష్క క్యూట్ స్మైల్

కరోనా సెకండ్ వేవ్ పై అనుష్క స్పందన
మహానందీశ్వర స్వామి ఆలయం లో అనుష్క పూజలు

అనుష్క ఘాటి విడుదల వాయిదా?
'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' సక్సెస్ తర్వాత స్టార్ యాక్ట్రెస్ క్వీన్ అనుష్క శెట్టి నటిస్తోన్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ 'ఘాటి'. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

క్వీన్ అనుష్క శెట్టి 'ఘాటి' రిలీజ్ డేట్ ఫిక్స్
క్వీన్ అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఘాటి' గ్లింప్స్ లో ఇంటెన్స్ వైలెంట్ క్యారెక్టర్ లో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇది పాన్-ఇండియా సంచలనం బాహుబలి తర్వాత, అనుష్క నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో పాన్-ఇండియా మూవీ. ఈ చిత్రం హై బడ్జెట్‌తో, అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందుతోంది.

ఈ సినిమాకు తొలి ప్రేక్షకుడ్ని నేనే - మెగాస్టార్ చిరంజీవి
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కాంబినేషన్‌లో రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. కాగా యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై మహేష్ బాబు.పి దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఈ నెల 7వ తేదీన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి నుంచి ప్రశంసలు లభించాయి. ఈ సినిమా ఆద్యంతం తనను ఆకట్టుకుందని, ఈ హిలేరియస్ ఎంటర్ టైనర్‌ను ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారని చిరంజీవి అన్నారు.

అనుష్క కొత్త సినిమా.. ఏకంగా 14 భాషల్లో
స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి త్వరలోనే ఒక కొత్త చిత్రాన్ని ప్రారంభించనున్నారు. అయితే ఇది ఏకంగా 14 భాషల్లో రిలీజ్ కానుండటం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. 'కథానార్ - ది వైల్డ్ సోర్సెరర్' అనే పేరుతో రూపొందనున్న ఈ సినిమా ప్రధానంగా హారర్ నేపథ్యంలో ఉండొచ్చని తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి గ్లింప్స్ రిలీజ్ చేశారు. కాగా ఇది మలయాళ సినిమా కావడం గమనార్హం. మరో విశేషం ఏంటంటే..? మలయాళంలో అనుష్కకు ఇదే తొలి సినిమా. 18 ఏళ్ల తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఆమె ఇప్పటివరకు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటించారు. ఇప్పుడు మొదటిసారిగా మాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది.

టాలెంటెడ్ హీరోయిన్ అనుష్క 18 సక్సెస్ ఫుల్ ఇయర్స్ జర్నీ
ఇండస్ట్రీలో ఇప్పుడు హీరోయిన్ల లైఫ్ టైమ్ ఎంత తక్కువుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు రెండు మూడు డెకెడ్లు రాణించేవారు. క్రమక్రమంగా తగ్గుకుంటూ వస్తుంది. ఇప్పుడైతే స్టార్ డమ్ వచ్చిన తర్వాత గట్టిగా ఐదారేళ్లు ఫుల్ బిజీగా ఉన్నా ఆతరువాత కొత్త హీరోయిన్లు రావడం వీరికి అవకాశాలు తగ్గడం జరుగుతున్నాయి. అయితే కొంతమంది హీరోయిన్లకు మాత్రం ఇది మినహాయింపే అని చెప్పొచ్చు. వారు సినిమాలు చేయడానికి ముందుకు రావాలే కానీ ఇంకా చేయడానికి దర్శకనిర్మాతలు రెడీగా ఉన్నారు. అలాంటి హీరోయిన్లలో మొదటగా అనుష్క శెట్టి గురించి చెప్పుకోవచ్చు.

మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ లో అరుంధతి, భాగమతి, దేవసేన పేర్లకు పెట్టింది పేరు అనుష్క. ఎన్నో ఏళ్లు స్టార్ హీరోయిన్ గా రాణించిన అనుష్క ఈమధ్య సినిమాలకు చాలా గ్యాప్ తీసుకుంటుంది. అనుష్క నుంటి వచ్చిన చివరి సినిమా నిశ్శబ్దం. ఈసినిమా వచ్చి మూడేళ్లు అయిపోయింది. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత మరో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తుంది. మహేష్ బాబు.పి దర్శకత్వంలో అనుష్క హీరోయిన్ గా వస్తున్న సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఇక ఈసినిమాలో తన సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపుతెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి కూడా నటిస్తున్నాడు. ఇక క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటి నుండీ ఈసినిమాపై భారీ…

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి టీజర్ అప్ డేట్
స్టార్ హీరోయిన్ అనుష్క, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఇప్పటివరకూ ఈసినిమా నుండి అనుష్క, నవీన్ పోలీశెట్టి కి సంబంధించిన ఫస్ట్ లుక్స్ పోస్టర్ల తో పాటు పలు స్పెషల్ పోస్టర్లు రిలీజ్ చేస్తూ వచ్చారు. అంతేకాదు మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. ఇక తాజాగా ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా తెలిపారు. రేపు అంటే ఏప్రిల్ 29వ తేదీన…

"అరుంధతి"లో జేజమ్మ పాత్ర పై అనుష్క స్పందన
స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో, అద్భుతమైన విజువల్స్ తో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ "అరుంధతి " మూవీ 13 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా అనుష్క సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఆ మూవీ లో జేజమ్మ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అనుష్క ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. అనుష్కను లేడీ సూపర్ స్టార్‌ని చేసిన ఈ చిత్రం ఆమెకే కాదు, తెలుగు చలన చిత్ర పరిశ్రమకే గర్వకారణంగా నిలిచింది.

13 వసంతాల "అరుంధతి "
మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై కోడి రామకృష్ణ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన హారర్ ఫాంటసీ "అరుంధతి "మూవీ 2009 జనవరి 16 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అరుంధతి ,జేజమ్మ గా ద్విపాత్రాభినయం చేసిన హీరోయిన్ అనుష్క అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. విలన్ గా సోనూసూద్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా "అరుంధతి "మూవీ ని దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించారు.

అఫీషియల్.. యూవీ క్రియేషన్స్ లో నవీన్
మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి.. ఆ తరువాత హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుసగా హిట్లు అందుకొని ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ యంగ్ హీరోల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న హీరో నవీన్ పోలిశెట్టి. ఏజెంట్ సాయి శ్రీనివాస్ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి హిట్ కొట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నవీన్ పోలిశెట్టి. ఆ తర్వాత వచ్చిన జాతిరత్నాలు సినిమాతోనూ మరో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు వరుసగా పెద్ద పెద్ద బ్యానర్లలో సినిమాలు చేసే అవకాశాలు వస్తున్నాయి నవీన్ పోలిశెట్టికి.

4 నెలలలో10 లక్షల మంది ఫాలోవర్స్ తో అనుష్క రికార్డ్
“సూపర్” మూవీ తో టాలీవుడ్ కు , “రెండు”మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన అనుష్క తెలుగు , తమిళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కమర్షియల్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ మూవీస్ కు అనుష్క పెట్టింది పేరుగా మారారు. “విక్రమార్కుడు”, “అరుంధతి “, “వేదం”, “బాహుబలి“, “రుద్రమదేవి “, “భాగమతి ”వంటి సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అనుష్క ఆకట్టుకున్నారు. పలు మూవీస్ కు బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. యు వి క్రియేషన్స్ బ్యానర్ లో ఒక మూవీ కి అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు .

ప్రభాస్ కు అనుష్క బర్త్ డే విషెస్
ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. ఈరోజు ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో అభిమానులు సోషల్ మీడియాలో తమ పోస్ట్ లతో సందడి చేస్తున్నారు. దీనితో పాటు ప్రభాస్ సినిమాల నుండి కూడా అప్ డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసందర్భంగా ప్రభాస్ కు దేశవ్యాప్తంగా బర్త్ డే విషెస్ అందుతున్నాయి. ఈనేపథ్యంలో అభిమానులతో పాటు సినీ ప్రముఖులు ప్రభాస్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందిస్తున్నారు. దీనిలో భాగంగానే అనుష్క కూడా ప్రభాస్ కు స్పెషల్ విషెస్ అందించింది. హ్యాపీ బర్త్ డే ప్రభాస్.. లైఫ్ లో వచ్చే ప్రతి అంశంలో బెస్ట్ గా ఉండాలని అలాగే నీ స్టోరీస్ అన్నీ విజయవంతం అయ్యి అందరి హృదయాలను…

అక్టోబర్ లో సెట్స్ పైకి 'చంద్రముఖి2'
పి.వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో వచ్చిన చంద్రముఖి సినిమా ఏ రేంజ్‌లో హిట్ అయిందో అందరికి తెలుసు. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. రజనీ స్టైల్‌కు, జ్యోతిక నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. తమిళ్ సినిమా అయినా తెలుగులో డబ్ అయి ఇక్కడ రిలీజ్ అవ్వగా ఇక్కడ కూడా సంచలన విజయం దక్కించుకుంది. ఇక ఇప్పుడు చంద్రముఖి సినిమాకు త్వరలో సీక్వెల్ రాబోతున్న సంగతి కూడా తెలిసిందే కదా. అయితే ఈసారి రాఘవ లారెన్స్ ఈసినిమాలో ప్రధాన పాత్రలో నటించనున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి కూడా చాలా రోజులైపోయింది.

14 వసంతాల "లక్ష్యం "
శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ , అనుష్క జంటగా రూపొందిన "లక్ష్యం "మూవీ 2007 సంవత్సరం జూలై 5వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. జగపతి బాబు ఒక కీలక పాత్రలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. కమర్షియల్ ఎలిమెంట్స్‌కు తోడు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా బాగానే వర్కవుట్ కావడంతో లక్ష్యం సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. హీరో గోపీచంద్ ఫస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన "లక్ష్యం " మూవీ 14 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది.

దేశీయ యాప్ "కూ " లో అనుష్క
తెలుగు , తమిళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుని అనుష్క స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. బ్లాక్ బస్టర్”అరుంధతి ” , “బాహుబలి “, బాహుబలి 2”, “రుద్రమ దేవి “, “భాగమతి” వంటి మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని అనుష్క క్రేజీ హీరోయిన్ గా మారారు. పలు మూవీస్ కు అనుష్క బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యు వి క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్ దర్శకత్వంలో రూపొందే ఒక మూవీ కి స్టార్ హీరోయిన్ అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

"లూసిఫర్ "తెలుగు రీమేక్ లో అనుష్క ?
తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని అనుష్క స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన "సైరా నరసింహా రెడ్డి "మూవీ లో అనుష్క వీరనారి ఝాన్సీ లక్ష్మీ బాయ్ గా అతిథి పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. అనుష్క ఇప్పుడు చిరంజీవి హీరోగా రూపొందనున్న రీమేక్ మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారని సమాచారం.

అనుష్క క్యూట్ స్మైల్
తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అనుష్క తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కు పెట్టింది పేరుగా మారిన అనుష్క బ్లాక్ బస్టర్ మూవీస్ "అరుంధతి "లో అరుంధతి , "వేదం "లో సరోజ , "బాహుబలి" లో దేవసేన , "రుద్రమదేవి "లో రుద్రమదేవి క్యారెక్టర్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బెస్ట్ యాక్ట్రెస్ గా అనుష్క పలు అవార్డ్స్ అందుకున్నారు.

కరోనా సెకండ్ వేవ్ పై అనుష్క స్పందన
భారత దేశంలో కరోనా వేవ్ అధిక ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. లక్షలలో కేసులు నమోదు , వేలల్లో మరణాలుసంభవిస్తున్నాయి. ప్రజలలో భయాందోళనలు పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రజలలో కరోనా పట్ల భయాన్ని తొలగించి , ధైర్యాన్ని నింపేలా , కరోనా కష్ట కాలాన్ని అధిగ మిస్తామనే భరోసా నిచ్చేలా సోషల్ మీడియా లో ఒక పోస్ట్ పెట్టారు.
మహానందీశ్వర స్వామి ఆలయం లో అనుష్క పూజలు
స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న అనుష్క తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. "అరుంధతి ", "రుద్రమ దేవి ", "భాగమతి " వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అనుష్క ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. బ్లాక్ బస్టర్ "బాహుబలి " , "బాహుబలి 2 " మూవీస్ లో దేవసేన గా అనుష్క ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "సైరా నరసింహా రెడ్డి "మూవీ లో అనుష్క వీరనారి ఝాన్సీ లక్ష్మీ బాయ్ గా అతిథి పాత్రలో అలరించారు.