‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సక్సెస్ తర్వాత స్టార్ యాక్ట్రెస్ క్వీన్ అనుష్క శెట్టి నటిస్తోన్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ఘాటి’. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ‘వేదం’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత అనుష్క, క్రిష్‌ల కలయికలో వస్తున్న రెండవ చిత్రం, అలాగే UV క్రియేషన్స్‌తో కలిసి చేస్తోన్న అనుష్క నాలుగో సినిమా ఘాటి. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే వున్నాయి. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన ఘాటి గ్లింప్స్‌లో అనుష్క ఇంటెన్స్ వైలెంట్ క్యారెక్టర్‌లో అందరినీ ఆశ్చర్యపరిచారు.
కాగా ఈ సినిమా ఏప్రిల్ 18న వరల్డ్ వైడ్ రిలీజ్ కావాల్సివుంది. అయితే ఈ మూవీ విడుదల వాయిదా పడినట్లు సమాచారం. ఈ డేకి ఒకరోజు ముందు (ఏప్రిల్ 17) తమన్నా భాటియా ప్రధానపాత్రలో నటించిన ‘ఓదెల 2’ చిత్రం థియేటర్లలోకి రానున్నట్టు మేకర్స్ తాజాగా ప్రకటించారు. దీంతో ఘాటి రిలీజ్ పోస్ట్‌పోన్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.
అయితే ఇందుకు సంబంధించి టీమ్ అధికారిక ప్రకటన చేయాల్సివుంది. కాగా విక్టిమ్, క్రిమినల్, లెజెండ్ అనే ట్యాగ్‌లైన్‌తో ఘాటి అద్భుతమైన కథనాన్ని, మానవత్వం, మనుగడ, ముక్తికి హామీ ఇస్తుంది. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విసెరల్, యాక్షన్-ప్యాక్డ్ ఎక్స్‌పీరియన్స్ అందించనుంది. ఇక ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీమ్ పని చేస్తున్నారు.
మనోజ్ రెడ్డి కాటసాని సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. అలాగే తోట తరణి ఆర్ట్ డైరెక్టర్ కాగా, చాణక్య రెడ్డి తూరుపు ఎడిటర్. అలాగే ఈ సినిమాకు చింతకింది శ్రీనివాసరావు కథ అందించగా, సాయిమాధవ్ బుర్రా మాటలు రాశారు. ఘాటి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం , హిందీతో సహా పలు భాషల్లో విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: