
ట్యాగ్ · 57 కథనాలు · పేజీ 3


శిరీష్ 'ప్రేమ కాదంట' డబ్బింగ్ స్టార్ట్

షూటింగ్ పూర్తి చేసుకున్న 'మహా సముద్రం'

బ్యాక్ టు వర్క్ అంటున్న అను ఇమ్మాన్యుయేల్

అను తో 'ప్రేమ కాదంట'న్న అల్లు శిరీష్

'మహా సముద్రం'.. గూని బాబ్జీ గా రావు రమేష్

బేబీ డాల్ అను ఇమ్మాన్యుయేల్
సంక్రాంతికి "అల్లుడు అదుర్స్"
మహాసముద్రం షూటింగ్ స్టార్ట్
'మహాసముద్రం'లో అను ఇమ్మాన్యుయేల్
మరోసారి నానికి జోడిగా అను ఇమ్మాన్యుయేల్?

`18 పేజెస్`లో అను ఇమ్మాన్యుయేల్?

'మహా సముద్రం' రిలీజ్ డేట్ ఫిక్స్
'ఆర్‌ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో సిద్ధార్థ్, శర్వానంద్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా మహాసముద్రం. ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి విడుదలైన పోస్టర్లు.. అలానే హే రంభ అంటూ వచ్చే సాంగ్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం థియేటర్లు ఓపెన్ అయి సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈసినిమా కూడా రిలీజ్ డేట్ ను ఖరారు చేసుకుంది. తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. అక్టోబర్ 14వ తేదీన ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు.

శిరీష్ 'ప్రేమ కాదంట' డబ్బింగ్ స్టార్ట్
రాకేశ్ శశి దర్శకత్వంలో యంగ్ హీరో అల్లు శిరీష్, మల్లూ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ జంటగా వస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రీ లుక్స్ తోనే తన సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాడు అల్లు శిరీష్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈసినిమా డబ్బింగ్ మొదలుపెట్టినట్టు శిరీష్ తన ఇన్ట్సా ద్వారా తెలియచేశాడు. అంతేకాదు.. ఇంకా ఒక షెడ్యూల్ షూటింగ్ మిగిలి ఉందని కూడా తెలిపాడు.

'మహా సముద్రం' మోషన్ పోస్టర్ రిలీజ్
శర్వానంద్, సిద్ధార్ధ్ హీరోలుగా అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'మహాసముద్రం'. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఓ డిఫరెంట్ కంటెంట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి విడుదల చేసిన శర్వానంద్, సిద్దార్ధ్, అదితిరావు హైదరి, అనూ ఇమాన్యూయేల్, జగపతి బాబు, రావు రమేష్, గరుడ రామ్ లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా మరో మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇప్పటివరకూ రిలీజ్ చేసిన పోస్టర్లు అన్నింటిని…

షూటింగ్ పూర్తి చేసుకున్న 'మహా సముద్రం'
శర్వానంద్, సిద్ధార్థ్ కథానాయకులుగా దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘మహాసముద్రం’. ఇప్పటికే విడుదల అయిన శర్వా, సిద్ధార్థ్, రావు రమేష్ పోస్టర్స్ ఆకట్టుకోగా.. రీసెంట్ గా విడుదల చేసిన గరుడ రామ్ పోస్టర్ సినిమాపై ఇంకా అంచనాలు పెంచేసింది. ఇక ఈసినిమా షూటింగ్ కూడా చాలా లేట్ గానే మొదలైంది. అయితే సెట్స్ పైకి వెళ్లిన తరువాత అజయ్ భూపతి చాలా తొందరగానే సినిమా షూటింగ్ ను పూర్తి చేశాడు. ఈసినిమా కంటే ముందు మొదలైన సినిమాలే ఇంకా షూటింగ్ ను పూర్తి చేసుకోలేకపోయాయి. కానీ మహాసముద్రం సినిమా మొదలవ్వడమే చాలా లేట్ గా మొదలైంది. కానీ కరోనా వల్ల బ్రేక్ లు వచ్చినా కూడా తొందరగానే షూటింగ్ ను పూర్తి…

బ్యాక్ టు వర్క్ అంటున్న అను ఇమ్మాన్యుయేల్
యంగ్ హీరో అల్లు శిరీష్, మల్లూ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ జంటగా ప్రేమ కాదంట అనే రొమాంటిక్ ఎంటర్ టైనర్ వస్తున్న సంగతి తెలిసిందే. రాకేశ్ శశి దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను అల్లు శిరీష్ బర్త్ డే సందర్భంగా ఇటీవలే రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇక ఈసినిమా పోస్టర్లతోనే అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా కరోనా సెకండ్ వేవ్ వల్ల షూట్ కు బ్రేక్ పడింది. అయితే ఇప్పుడు మళ్లీ పరిస్థితులు కాస్త నార్మల్ కు రావడంతో అందరూ షూటింగ్ ను మొదలుపెడుతున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఈసినిమా షూట్ ను కూడా స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే మళ్లీ వర్క్ లో జాయిన్ అయింది…

అను తో 'ప్రేమ కాదంట'న్న అల్లు శిరీష్
ప్రీ లుక్స్ తోనే తన సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాడు అల్లు శిరీష్. యంగ్ హీరో అల్లు శిరీష్, మల్లూ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ వస్తున్న సంగతి తెలిసిందే. రాకేశ్ శశి దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను అల్లు శిరీష్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసింది చిత్రయూనిట్.' ప్రేమ కాదంట' అనే టైటిల్ ను పెట్టి ఒకటి కాదు రెండు పోస్టర్స్ ను రిలీజ్ చేశారు. ప్రీలుక్స్ తో ప్రేమ కాదంట చిత్రానికి వచ్చిన హైప్ ని మరింత పెంచేలా తాజాగా విడుదల చేసిన రెండు ఫ్టస్ లుక్స్ ఉండటం విశేషం. శిరీష్, అను అద్దంలో సెల్ఫీ దిగుతూ.. శిరీష్ ముద్దు పెట్టే స్టిల్ తో మొదటి ఫస్ట్ లుక్…

ప్రీ లుక్స్ తోనే బజ్ పెంచుతున్న 'శిరీష్'
మొత్తానికి అల్లు శిరీష్ ప్రీ లుక్స్ తోనే తన కొత్త సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాడు. 'విజేత' 'జతకలిసే' ఫేమ్ రాకేష్ శశి దర్శకత్వంలో శిరీష్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా టైటిల్ ను, ఫస్ట్ లుక్ ను శిరీష్ పుట్టినరోజు సందర్భంగా మే 30న ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈగ్యాప్ లో ప్రీలుక్స్ ను రిలీజ్ చేస్తున్నారు. ఇక రిలీజ్ అయిన రెండు ప్రీ లుక్స్ ను చూస్తుంటే ఈసారి రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో వస్తున్నాడన్న సంగతి అర్థమవుతుంది. దీంతో మే 30న విడుదల కాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పై అంతటా ఆసక్తి నెలకొంది.

'అల్లు శిరీష్' కొత్త సినిమా టైటిల్ రిలీజ్ కు డేట్ ఫిక్స్
అల్లు ఫ్యామిలీ నుండి వచ్చినా కూడా అల్లుశిరీష్ మాత్రం కెరీర్ లో ఊగిసలాడుతూనే ఉన్నాడు. ఇప్పటివరకూ తను చేసిన సినిమాల్లో ఒకటో రెండో పర్వాలేదు అనిపించుకున్నాయి తప్పా సాలిడ్ బ్లాక్ బస్టర్ రుచి మాత్రం ఇంకా చూడలేదు. ఇక చివరగా 2019లో ABCD అనే ఒక సినిమాను చేశాడు. అప్పటినుండి ఇప్పటివరకూ మరే సినిమా రాలేదు.

'మహా సముద్రం'.. గూని బాబ్జీ గా రావు రమేష్
విలన్ పాత్ర, తండ్రి పాత్ర, సపోర్టింగ్ రోల్ ఇలా ఏ క్యారెక్టర్ అయినా సరే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి పాత్రకు ప్రాణం పెట్టి నటిస్తాడు రావు రమేష్. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో కొత్తదనంతో కూడిన పాత్రలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు మరో ఛాలెంజింగ్ రోల్ లో నటించనున్నారు.

బేబీ డాల్ అను ఇమ్మాన్యుయేల్
చైల్డ్ ఆర్టిస్ట్ అను ఇమ్మాన్యుయేల్ “యాక్షన్ హీరో బిజు “మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయం అయ్యారు. “మజ్ను ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అను “కిట్టు ఉన్నాడు జాగ్రత్త “మూవీ తో ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ “తుప్పరివాలన్ “మూవీ తో అను కోలీవుడ్ లో అడుగు పెట్టారు. యాక్షన్ హీరో గోపీచంద్ “ఆక్సిజన్ “, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “అజ్ఞాతవాసి “, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ “నా పేరు సూర్య “, నాగచైతన్య “శైలజా రెడ్డి అల్లుడు “, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ “అల్లుడు అదుర్స్ ” మూవీస్ లో అను కథానాయికగా నటించి తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు.

"మహాసముద్రం" అను ఇమ్మాన్యుయేల్ స్పెషల్ పోస్టర్
"స్వప్న సంచారి "మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమ కు చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయిన అనుఇమ్మాన్యుయేల్ "యాక్షన్ హీరో బిజు "మూవీ తో కథానాయికగా మారారు. "మజ్ను " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అను "కిట్టు ఉన్నాడు జాగ్రత్త "మూవీ తో ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ "తుప్పరివాలన్ "మూవీ తో అను కోలీవుడ్ లో అడుగు పెట్టారు. "ఆక్సిజన్ ", "అజ్ఞాతవాసి ", "నా పేరు సూర్య ", "శైలజా రెడ్డి అల్లుడు ", "అల్లుడు అదుర్స్ " మూవీస్ లో నటించినా అను కు బ్రేక్ రాలేదు.
సంక్రాంతికి "అల్లుడు అదుర్స్"
రమేష్ కుమార్ గంజి సమర్పణలో సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సూపర్ హిట్ "కందిరీగ "మూవీ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ "అల్లుడు అదుర్స్ "మూవీ జనవరి 15 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. నభా నటేష్ , అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. సోనూ సూద్ , ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
మహాసముద్రం షూటింగ్ స్టార్ట్
శర్వానంద్ హీరోగా, అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహాసముద్రం’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరో రేంజ్ అందుకున్న సిద్దార్థ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
'మహాసముద్రం'లో అను ఇమ్మాన్యుయేల్
అజయ్ భూపతి దర్శకత్వంలో విలక్షణ పాత్రలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న హీరో శర్వానంద్, ప్రతిభావంతుడైన నటుడిగా పేరు తెచ్చుకున్న హీరో సిద్ధార్థ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా 'మహాసముద్రం'. ఇక ఈ సినిమాకు సంబంధించి రోజుకో అప్ డేట్ ఇస్తూనే ఉన్నారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమాలో టాలెంటెడ్ యాక్ట్రెస్ అదితి రావ్ హైదరిని ఎంపిక చేసినట్టు ఇటీవలే ప్రకటించగా.. ఇప్పుడు తాజాగా మరో హీరోయిన్ ను ఫిక్స్ చేశారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. అందాల తార అను ఇమ్మాన్యుయేల్‌ను మరో హీరోయిన్ రోల్ కోసం ఎంపిక చేశారు. ఆమెది కూడా ప్రాధాన్యం ఉన్న పాత్రగా తెలుస్తుంది.
మరోసారి నానికి జోడిగా అను ఇమ్మాన్యుయేల్?
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన ‘మజ్ను’(2016)తో తెలుగుతెరకు కథానాయికగా పరిచయమైంది అను ఇమ్మాన్యుయేల్. ఆపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వంటి అగ్ర కథానాయకులతో ఆడిపాడింది. స్వల్ప విరామం అనంతరం.. ‘అల్లుడు అదుర్స్’లో ఓ నాయికగా నటిస్తోంది అను. ఇదిలా ఉంటే.. తాజాగా అను ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్ చేరిందని సమాచారం.

`18 పేజెస్`లో అను ఇమ్మాన్యుయేల్?
యువ కథానాయకుడు నిఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘18 పేజెస్’. ‘కుమారి21 ఎఫ్’ ఫేమ్ సూర్య ప్రతాప్ పల్నాటి డైరెక్ట్ చేయనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం పూర్వ నిర్మాణ దశలో ఉంది.

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కి జోడీగా అను ఇమ్మాన్యుయేల్?
`మజ్ను`(2016)తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది అను ఇమ్మాన్యుయేల్. ఆపై `కిట్టు ఉన్నాడు జాగ్రత్త`, `ఆక్సిజన్`, `అజ్ఞాతవాసి`, `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా`, `శైలజా రెడ్డి అల్లుడు`, `గీత గోవిందం` (గెస్ట్ రోల్) చిత్రాల్లో అలరించింది ఈ టాలెంటెడ్ బ్యూటీ. గత ఏడాదిని `జీరో రిలీజెస్ ఇయర్`గా సరిపెట్టిన అను.. త్వరలో తెలుగునాట రీ-ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోందట.