అల్లు ఫ్యామిలీ నుండి వచ్చినా కూడా అల్లుశిరీష్ మాత్రం కెరీర్ లో ఊగిసలాడుతూనే ఉన్నాడు. ఇప్పటివరకూ తను చేసిన సినిమాల్లో ఒకటో రెండో పర్వాలేదు అనిపించుకున్నాయి తప్పా సాలిడ్ బ్లాక్ బస్టర్ రుచి మాత్రం ఇంకా చూడలేదు. ఇక చివరగా 2019లో ABCD అనే ఒక సినిమాను చేశాడు. అప్పటినుండి ఇప్పటివరకూ మరే సినిమా రాలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక లాంగ్ గ్యాప్ తరువాత శిరీష్ మరో కొత్త సినిమాతో వస్తున్నాడు. రాకేష్ శశి దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈనేపథ్యంలో తాజాగా ఇక సినిమాకు సంబంధించిన ఒక అప్ డేట్ వచ్చింది. ఈసినిమా టైటిల్ ఫస్ట్ లుక్ ను మే 30న అంటే శిరీష్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నారు. అంతేకాదు ఒక పోస్టర్ ను రిలీజ్ చేయగా అందులో హీరోయిన్ తో ముద్దు పెట్టే సీన్ కనిపిస్తుంది. దీంతో ఈసారి శిరీష్ జోనర్ ను మార్చినట్టే కనిపిస్తుంది.
Here’s a movie that gives a refreshing perspective to love and relationship. Presenting the Pre Look of @AlluSirish & @ItsAnuEmmanuel‘s #Sirish6 💞#Sirish6FirstLook 👉🏻 May 30th at 11 am! ✅
Advance Birthday Wishes to #AlluSirish 🥳#AlluAravind @GA2Official pic.twitter.com/FVJXcOFAIf
— GA2 Pictures (@GA2Official) May 27, 2021
కాగా అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మిస్తున్నారు. మిగిలిన నటీనటులు, ఇతర వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు. ఇక ఎప్పటినుండో హిట్ కోసం ఎదురుచూస్తున్న అల్లు శిరీష్ కు ఈసినిమా అయినా సక్సెస్ ఇస్తుందేమో చూద్దాం..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: