చైల్డ్ ఆర్టిస్ట్ అను ఇమ్మాన్యుయేల్ “యాక్షన్ హీరో బిజు “మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయం అయ్యారు. “మజ్ను ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అను “కిట్టు ఉన్నాడు జాగ్రత్త “మూవీ తో ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ “తుప్పరివాలన్ “మూవీ తో అను కోలీవుడ్ లో అడుగు పెట్టారు. యాక్షన్ హీరో గోపీచంద్ “ఆక్సిజన్ “, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “అజ్ఞాతవాసి “, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ “నా పేరు సూర్య “, నాగచైతన్య “శైలజా రెడ్డి అల్లుడు “, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ “అల్లుడు అదుర్స్ ” మూవీస్ లో అను కథానాయికగా నటించి తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అను ఇమ్మాన్యుయేల్ ప్రస్తుతం ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అజయ్ భూపతి దర్శకత్వంలో సముద్రం నేపథ్యం లో రూపొందుతున్న లవ్ &యాక్షన్ మూవీ “మహాసముద్రం ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. బ్రిలియంట్ ఫ్యాషన్ సెన్స్ ఉన్న అను అవార్డ్ ఫంక్షన్స్ , ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు స్టైలిష్ గా అటెండ్ అవుతున్న విషయం తెలిసిందే. సమ్మర్ ఫ్యాషన్ ఐడియా డ్రెస్సింగ్ తో ఉన్న తన ఫొటో ను ఇన్ స్టాగ్రామ్ లో అను షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: