విలన్ పాత్ర, తండ్రి పాత్ర, సపోర్టింగ్ రోల్ ఇలా ఏ క్యారెక్టర్ అయినా సరే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి పాత్రకు ప్రాణం పెట్టి నటిస్తాడు రావు రమేష్. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో కొత్తదనంతో కూడిన పాత్రలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు మరో ఛాలెంజింగ్ రోల్ లో నటించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ – సిద్దార్థ్ ప్రధాన పాత్రల్లో మహాసముద్రం అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వైజాగ్ నేపథ్యంలో నడిచే క్రైమ్ థ్రిల్లర్ గా ఈ మహాసముద్రం చిత్రం రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక నేడు తన పుట్టినరోజు సందర్భంగా తాను చేస్తున్న పలు సినిమాల నుంచి రోల్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే కె.జి.యఫ్ 2 నుండి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈసినిమాలో కన్నెగంటి రాఘవన్ అనే సీబీఐ ఆఫీసర్ పాత్రలో రావు రమేష్ నటిస్తున్నారు. ఇక మహాసముద్రం నుండి కూడా పోస్టర్ ను రిలీజ్ చేశారు. గూని బాబ్జీ అనే పాత్రలో గూని ఉండే వ్యక్తిగా నటిస్తున్నాడు. మరి తన రోల్ పేరుకి తగ్గట్టుగానే సాలిడ్ మేకోవర్ లో కనిపిస్తున్నారు. ఓ గూని వ్యక్తిగానే పక్కా నెగిటివ్ షేడ్ లో తాను ఉన్నట్టు అనిపిస్తుంది.
Wishing the Incredibly Versatile Actor #RaoRamesh garu a Very Happy Birthday!
Introducing him as #GooniBabji from our #MahaSamudram 🌊@ImSharwanand @Actor_Siddharth @aditiraohydari @ItsAnuEmmanuel @chaitanmusic @DirAjayBhupathi @AnilSunkara1 @AKentsOfficial @SonyMusicSouth pic.twitter.com/WzcvMHC1jT
— Ajay Bhupathi (@DirAjayBhupathi) May 25, 2021
కాగా ఈ సినిమాలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో మరో హీరో సిద్ధార్ద్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా.. రాజ్ తోటా సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: