
ట్యాగ్ · 524 కథనాలు


అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. సినీ ప్రముఖుల సంతాపం

పుష్ప 2 ఫస్ట్ టైం టీఆర్పీ ఎంతంటే
ఒకే ఒక్కడు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

రీ రిలీజ్ కానున్న ఆర్య 2
అల్లు అర్జున్ సినీ ప్రయాణానికి 22 ఏళ్ళు

అల్లు అర్జున్- త్రివిక్రమ్ మూవీ అప్డేట్

అల్లు అర్జున్ నెక్స్ట్ అట్లీ తోనే
ఆయన సీన్ చెబుతుంటే నాకు పిచ్చెక్కిపోతుంది

పుష్ప 2 థాంక్యూ మీట్ ఈరోజే

అల్లు అర్జున్ 22కి తమన్ మ్యూజిక్

తండేల్ ఈవెంట్ కు రానున్న అల్లు అర్జున్
బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపిన అల్లు అర్జున్

రికార్డు సృష్టించిన పుష్ప 2

అభ్యంకర్ కు అల్లు అర్జున్ బర్త్ డే విషెస్
ప్రైవేట్ సాంగ్స్ తో క్రేజ్ తెచ్చుకొని కోలీవుడ్ వరుస ఆఫర్లు కొట్టేస్తున్న యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ఈరోజు తన 21వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఎక్స్ ఖాతా ద్వారా విషెస్ చెప్పాడు.నా బ్రదర్ సాయి అభ్యంకర్ కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశాడు.

కాంతార చాప్టర్ 1 చూస్తున్నంత సేపు ఒక ట్రాన్స్‌లో ఉండిపోయాను - అల్లు అర్జున్
దసరా రోజు విడుదలై థియేటర్లలో బ్లాక్ బస్టర్ రన్ కొనసాగిస్తున్న కన్నడ చిత్రం కాంతార చాప్టర్ 1.కాంతార ప్రీక్వెల్ గా వచ్చిన ఈసినిమా ఇప్పటికే పలు రికార్డులు సృష్టించింది.ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈసినిమాను చూసి మైమరిచిపోయారు.ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ, సోషల్ మీడియా వేదికగా తన అనుభూతిని అభిమానులతో పంచుకున్నారు.

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. సినీ ప్రముఖుల సంతాపం
దేశవ్యాప్తంగా అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఘటన కలకలం సృష్టించింది. నిన్న గుజరాత్ లోని అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో చోటుచేసుకున్న ఈ దుర్ఘటన ప్రతి ఒక్కరిని కలిచి వేస్తుంది. ఇక్కడినుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం, గాల్లోకి లేచిన కొద్ది నిమిషాలకే దగ్గరలోని ఒక మెడికల్ కాలేజీ క్యాంపస్ లోని భవనంపై కుప్పకూలిపోయింది. దీంతో విమానంలోని 241 మందితో పాటు ఆ భవనంలోని వైద్య విద్యార్థులు మరో 24 మంది మొత్తం 265 మంది దుర్మరణం చెందారు.

పుష్ప 2 ఫస్ట్ టైం టీఆర్పీ ఎంతంటే
గత ఏడాది చివర్లో థియేటర్లలో విడుదలై ఇండియన్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది పుష్ప 2.భారీ అంచనాల మధ్య ఈసినిమా విడుదలకాగా మొదటి రోజు ఏకంగా 294 కోట్ల వసూళ్లతో ఆల్ టైం రికార్డు ఓపెనింగ్స్ ను రాబట్టి చరిత్ర సృష్టించింది. ఫుల్ రన్ లో 1800 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి బాహుబలి 2 ను క్రాస్ చేసింది. హిందీలో అయితే ఏకంగా 800 కోట్లకుపైగా నెట్ వసూళ్లతో ఆల్ టైం రికార్డు సృష్టించింది.ఆ తరువాత పుష్ప 2 దాదాపు మూడున్నర గంటల రన్ టైం తో ఓటిటి లోకి వచ్చింది.ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ లో వుంది.
ఒకే ఒక్కడు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
విసుగును వీడి..విజయం కోరి.. విరామం ఎరుగక పనిచేయలోయ్.. అసాధ్యమనేది అసలే లేదని, చరిత్ర నేర్పెను పవిత్ర పాఠం అన్న కవి మాటలు లక్ష్యం దిశగా పయనం సాగించే ప్రతి వ్యక్తి విషయంలో అక్షర సత్యాలు. విజయమనేది ఏ ఒక్కర్ని రాత్రికి రాత్రే వరించదు. తన బలము, బలహీనతలను బేరిజు వేసుకుని, జయపజయాలను సమానంగా స్వీకరిస్తూ, ఉన్నత లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో శ్రమించే వ్యక్తులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు.

అల్లు అర్జున్-అట్లీ.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది
'పుష్ప 2' చిత్రంతో ఇండియన్ సినిమా హిస్టరీలోనే కనీవినీ ఎరుగని రీతిలో రూ.1900 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు అందుకుని చరిత్ర సృష్టించాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. దీని తర్వాత ఆయన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ పౌరాణిక చిత్రంలో నటించనున్నారు. మైథలాజికల్ జానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ పురాణం పురుషుడు కుమారస్వామి పాత్రను పోషించనున్నారని సమాచారం.

రీ రిలీజ్ కానున్న ఆర్య 2
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. ఆర్య 2 రిలీజ్ చేయమని చాలా రోజులనుండి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అడుగుతున్న విషయం తెలిసిందే. ఇక వారి ఎదురుచూపులకు తెరపడనుంది.ఈనెల 5న ఆర్య 2 మళ్ళీ థియేటర్లలో రిలీజ్ కానుంది.ఈనెల 7న అల్లు అర్జున్ తన బర్త్ డే జరుపుకోనున్నాడు. ఈ సందర్భంగా రెండు రోజుల ముందు ఆర్య 2 రిలీజ్ కానుంది.
అల్లు అర్జున్ సినీ ప్రయాణానికి 22 ఏళ్ళు
తొమ్మిది దశాబ్దాలకు పైబడి చరిత్ర కలిగిన తెలుగు చిత్ర పరిశ్రమలో మొట్టమొదటి నేషనల్ అవార్డు గెలుచుకున్న తొలి తెలుగు హీరో అల్లు అర్జున్. అల్లు రామలింగయ్య వంటి లెజెండరీ నటుడి మనవడిగా, అల్లు అరవింద్ వంటి స్టార్ ప్రొడ్యూసర్ తనయుడిగా ఘనమైన వారసత్వం కలిగిన కుటుంబం నుంచి వచ్చినా స్వయంకృషితో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు ఈ టాలీవుడ్ స్టార్ హీరో.

అల్లు అర్జున్- త్రివిక్రమ్ మూవీ అప్డేట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో నాలుగో సినిమా రానుందని తెలిసిందే.నిజానికి పుష్ప 2 తరువాతే ఈసినిమా ఉంటుందనుకున్నారు కానీ మధ్యలో అల్లు అర్జున్ మరో సినిమా చేయనున్నాడు.ఆ తరువాత త్రివిక్రమ్ సినిమాను మొదలుపెట్టనున్నాడు.ఇక ఈసినిమా గురించి నాగవంశీ సూపర్ అప్డేట్ ఇచ్చారు. ఈసినిమా మైథలాజికల్ మూవీ గా తెరకెక్కనుందని సినిమా వచ్చాక దేశం అంతా షాక్ అవుతుందని అన్నారు. అలాగే రామాయణం ,మహాభారతం కాకుండా వేరే దేవుడి గురించి ఈసినిమా వుండనుందని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూ లో నాగవంశీ చెప్పారు.

అల్లు అర్జున్ నెక్స్ట్ అట్లీ తోనే
పుష్ప 2 తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇమేజ్ మారిపోయింది.గత ఏడాది చివర్లో విడుదలైన ఈసినిమా 1800 కోట్లకుపైగా వసూళ్ళతో బహుబలి 2 రికార్డు ను బ్రేక్ చేసి సెన్సేషన్ సృష్టించింది, ముఖ్యంగా హిందీ లో ఊహించని రన్ ను కొనసాగించింది. 820 కోట్ల నెట్ తో అక్కడ అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా మొదటి స్థానంలో కొనసాగుతుంది.ఈసినిమా తో అల్లు అర్జున్ హిందీ లో బాగా పాపులర్ అయిపోయాడు.

పుష్ప 2.. ఆల్ టైమ్ రికార్డ్ కలెక్షన్స్
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప 2: ది రూల్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. ఓటీటీ లోకి వచ్చినప్పటికీ ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ క్రమంలో వరల్డ్ వైడ్‌గా రూ. 1,871కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ మేరకు తాజాగా చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది.

నేషనల్ అవార్డ్ విన్నర్ పర్‌ఫార్మ్ చేస్తే ఎలా ఉంటుందో చూశారు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ దర్శకుడు సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి నిర్మించిన ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ 'పుష్ప-2' ది రూల్. ఈ చిత్రాన్ని అత్యంత భారీ వ్యయంతో అన్ కాంప్రమైజ్‌డ్‌గా నిర్మించారు నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్. డిసెంబరు 5న విడుదలైన ఈ చిత్రం ప్రపంచస్థాయిలో ఎంతటి గొప్ప విజయం సాధించింతో అందరికి తెలిసిందే.
ఆయన సీన్ చెబుతుంటే నాకు పిచ్చెక్కిపోతుంది
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ దర్శకుడు సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి నిర్మించిన ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ 'పుష్ప-2' ది రూల్. ఈ చిత్రాన్ని అత్యంత భారీ వ్యయంతో అన్ కాంప్రమైజ్‌డ్‌గా నిర్మించారు నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్. డిసెంబరు 5న విడుదలైన ఈ చిత్రం ప్రపంచస్థాయిలో ఎంతటి గొప్ప విజయం సాధించింతో అందరికి తెలిసిందే.

పుష్ప 2 థాంక్యూ మీట్ ఈరోజే
గత ఏడాది చివర్లో థియేటర్లలోకి వచ్చి ఇండియన్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది పుష్ప 2.భారీ అంచనాల మధ్య వచ్చిన ఈసినిమా ఆ అంచనాలను అందుకుంటూ ఏకంగా 1800 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టుకుంది. హిందీలో అయితే ఏకంగా 800 కోట్లకుపైగా నెట్ వసూళ్లతో ఆల్ టైం రికార్డు సృష్టించింది.రీసెంట్ గా పుష్ప 2 ఓటిటిలోకి కూడా వచ్చింది.నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ లో వుంది.అయితే ఇంతా భారీ విజయం సాధించిన కూడా ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ ఒక్కటి కూడా జరుపలేదు.దానికి కారణం సినిమా రిలీజ్ ముందు రోజు సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన.దాంతో అటు అల్లు అర్జున్ కూడా ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోయాడు.

అల్లు అర్జున్ 22కి తమన్ మ్యూజిక్
పుష్ప 2 తరువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడని తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. కుదిరితే ఈసినిమాను ఉగాదికి లాంచ్ చేయాలని చూస్తున్నారు. ఇక ఈసినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ను తీసుకున్నారట. ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ చేశానని తమన్ అన్నాడు. రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూ లో తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి అడుగగా తమన్ ఈ విషయాన్ని వెల్లడించాడు .

తండేల్ ఈవెంట్ కు రానున్న అల్లు అర్జున్
వచ్చే నెలలో మోస్ట్ అవైటెడ్ మూవీ గా వస్తుంది నాగ చైతన్య,సాయి పల్లవి ల తండేల్.రిలీజ్ కు ఇంకా వారం రోజులే వుంది.సాంగ్స్ ,ట్రైలర్ తో సినిమాకు సూపర్ హైప్ వచ్చింది. ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు.అందులో భాగంగా నిన్న చెన్నై లో ఈవెంట్ చేసి తమిళ వెర్షన్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ఈరోజు ముంబై లో హిందీ వెర్షన్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక తెలుగులో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు.రేపు హైదరాబాద్ లో ఈ ఈవెంట్ జరుగనుండగా దీనికి ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రానున్నాడు.పుష్ప 2 తరువాత అల్లు అర్జున్ అటెండ్ అవుతున్న ఈవెంట్ ఇదే.దాంతో ఈవెంట్ లో అల్లు అర్జున్ ఏం మాట్లాడుతాడో అని సర్వత్రా…

ఓటీటీ లోకి వచ్చేసిన పుష్ప 2
థియేటర్లలో సెన్సేషనల్ రన్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన పుష్ప 2 ఇక ఓటీటీ లోకి వచ్చేసింది. భారీ ధరకు నెట్ ఫ్లిక్స్ అన్ని భాషలకు ఈ సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకుంది. ఇక 56 రోజుల థియేట్రికల్ రన్ తరువాత పుష్ప 2ను స్ట్రీమింగ్ కి తీసుకొస్తోంది. జనవరి 30న ఈసినిమా సౌత్ భాషల్లో అందుబాటులోకి రానుంది.

భారీ రన్ టైంతో ఓటిటిలోకి పుష్ప 2
థియేటర్లలో సెన్సేషనల్ రన్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన పుష్ప 2 ఇక ఓటిటిలోకి రానుంది.భారీ ధరకు నెట్ ఫ్లిక్స్ అన్ని భాషలకు ఈసినిమా డిజిటల్ హక్కులను దక్కించుకుంది.ఇక 56 రోజుల థియేట్రికల్ రన్ తరువాత పుష్ప 2ను స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.జనవరి 30న ఈసినిమా సౌత్ భాషల్లో అందుబాటులోకి రానుంది.హిందీ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేయలేదు.అక్కడ ఇంకా సూపర్ రన్ కొనసాగిస్తోంది.దాంతో నెట్ ఫ్లిక్స్ ఆలస్యంగా హిందీ వెర్షన్ ను రిలీజ్ చేయనుంది.ఇటీవలే థియేటర్లలో ఈసినిమాకు అదనంగా 20 నిమిషాల సీన్ల ను యాడ్ చేసి రీలోడ్ వెర్షన్ ను రిలీజ్ చేశారు.ఓటిటి కోసం ఈ రీలోడెడ్ వెర్షన్ కు అదనంగా మరో 3 నిమిషాల…
బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపిన అల్లు అర్జున్
టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగు సినీ రంగానికి ఆయన చేసిన కృషికి గాను పద్మ అవార్డుతో సత్కరించింది. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

రికార్డు సృష్టించిన పుష్ప 2
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ...51 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది.ఇప్పటికీ ఈసినిమా డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంటుంది.రీసెంట్ గా 20 నిమిషాల సీన్లను యాడ్ చేసి పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ తో రిలీజ్ చేయగా దీనికి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఫస్ట్ టైం చూసిన వారు మరోసారి థియేటర్లకు వస్తున్నారు.ఇక ఈసినిమా హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య 70ఎమ్ఎమ్ థియేటర్ లో ఆల్ టైం రికార్డు సృష్టించింది.