టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగు సినీ రంగానికి ఆయన చేసిన కృషికి గాను పద్మ అవార్డుతో సత్కరించింది. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదేక్రమంలో అల్లు అర్జున్ కూడా సోషల్ మీడియా వేదికగా బాలయ్యకి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆయనతోపాటు పద్మభూషణ్ అవార్డు అందుకున్న కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ మరియు ఇతర పద్మ అవార్డులకు ఎంపికైన కన్నడ సీనియర్ సీనియర్ నటుడు అనంత్ నాగ్, నటి శోభన, డైరెక్టర్ శేఖర్ కపూర్ తదితరులను అల్లు అర్జున్ అభినందించారు.
కాగా అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రం గత నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రష్మిక మందున్న హీరోయిన్ గా నటించగా.. ఫహద్ ఫాజిల్, రావు రమేష్, జగపతి బాబు, అజయ్, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: